సోషల్ మీడియా లైఫ్‌లో లైఫ్ లేదు : శిల్ప
బాలీవుడ్ ఫిట్ బ్యూటీ శిల్పా శెట్టి ఎప్పుడూ పాజిటివ్ మైండ్‌తోనే ఆలోచిస్తూ.. పాజిటివిటీని స్ప్రెడ్ చేయడంలో ముందుంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా పోస్ట్‌లను మన జీవితాలకు ఆపాదించుకుని.. బాధపడకూడదని సూచించింది. పోస్ట్‌ల ఫిల్టర్ల ముసుగు వెనుక ఎన్నో కష్టాలు, పోరాటాలు, అభద్రతా భావాలు, హృదయ విదారక ఘటనలు ఉంటాయని.. కానీ మనకు మాత్రం హ్యాపీనెస్ మాత్రమే కనపడుతూ వీటన్నింటినీ దాచేస్తాయని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ మేరకు సోషల్ మీడియా లైఫ్.. రియల్ […]
బాలీవుడ్ ఫిట్ బ్యూటీ శిల్పా శెట్టి ఎప్పుడూ పాజిటివ్ మైండ్‌తోనే ఆలోచిస్తూ.. పాజిటివిటీని స్ప్రెడ్ చేయడంలో ముందుంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా పోస్ట్‌లను మన జీవితాలకు ఆపాదించుకుని.. బాధపడకూడదని సూచించింది. పోస్ట్‌ల ఫిల్టర్ల ముసుగు వెనుక ఎన్నో కష్టాలు, పోరాటాలు, అభద్రతా భావాలు, హృదయ విదారక ఘటనలు ఉంటాయని.. కానీ మనకు మాత్రం హ్యాపీనెస్ మాత్రమే కనపడుతూ వీటన్నింటినీ దాచేస్తాయని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ మేరకు సోషల్ మీడియా లైఫ్.. రియల్ లైఫ్ మధ్య భేదాన్ని చెప్పేందుకు ప్రయత్నించింది.
https://www.instagram.com/p/CC2jiG7BjX0/?igshid=sibqnkzqinb0
ఇక్కడ ఎవరి జీవితాలు సంపూర్ణంగా లేవని.. చాలా మంది తమ సొంత సమస్యలతో బాధపడుతున్నారని తెలిపింది. కాబట్టి బాధలో ఉన్న వ్యక్తులు ఇతరుల హ్యాపీనెస్ పోస్ట్‌లు చూసి మోసపోవద్దని.. మీ మనస్సును భావోద్వేగాలతో నింపకూడదని సూచించింది. జీవితం ఎవరికి కూడా గులాబీల మంచం కాదంది శిల్ప. సోషల్ మీడియాలో నిర్మాణాత్మక విమర్శలు, శ్రద్ధతో సానుకూలంగా మార్చడానికి ప్రయత్నించాలని.. సామాజిక మాధ్యమాన్ని ఆరోగ్యకరమైన సమాజంగా మారుద్దామని సూచించింది.