షీనా బోరా కేసు: పీటర్ ముఖర్జియాకు బెయిల్
షీనాబోరా హత్య కేసులో సహ నిందితుడు పీటర్ ముఖర్జియాకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సీబీఐ ఆరు వారాల పాటు బెయిల్‌పై స్టే విధించాలని కోరింది. దీనికి ధర్మాసనం సమ్మతి తెలిపింది. దీంతో పీటర్ ముఖర్జీకి బెయిల్ మంజూరు అయినా ఆరువారాల పాటు జైళ్లలోనే ఉండనున్నారు. తన మాజీ భార్య ఇంద్రాణీ ముఖర్జియా కుమార్తె షీనా బోరా హత్య కేసులో… […]
షీనాబోరా హత్య కేసులో సహ నిందితుడు పీటర్ ముఖర్జియాకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సీబీఐ ఆరు వారాల పాటు బెయిల్‌పై స్టే విధించాలని కోరింది. దీనికి ధర్మాసనం సమ్మతి తెలిపింది. దీంతో పీటర్ ముఖర్జీకి బెయిల్ మంజూరు అయినా ఆరువారాల పాటు జైళ్లలోనే ఉండనున్నారు.
తన మాజీ భార్య ఇంద్రాణీ ముఖర్జియా కుమార్తె షీనా బోరా హత్య కేసులో… ఇంద్రాణితో పాటు పీటర్ ముఖర్జియా కూడా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. 2012 ఏప్రిల్ 24న షీనా బోరాను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని మహారాష్ట్రలోని ఓ లోయలో పడవేసినట్టు వీరిద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.