బీజేపీలో చేరిన శశికళ

        ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఆదివారం రోజున బీజేపీలో చేరారు. బీజేపీ నాయకులు పి. మురళీధర్ రావు, పొన్. రాధాకృష్ణన్‌లు ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఆమె రాకతో 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి బలం చేరుతుందని మురళీధర్ అన్నారు.         బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే జాలరుల సమస్యలు తీరాయని, అలాంటి సమస్యలను గుర్తించే ఏకైక పార్టీ […]

Update: 2020-02-02 20:31 GMT

ఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఆదివారం రోజున బీజేపీలో చేరారు. బీజేపీ నాయకులు పి. మురళీధర్ రావు, పొన్. రాధాకృష్ణన్‌లు ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఆమె రాకతో 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి బలం చేరుతుందని మురళీధర్ అన్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే జాలరుల సమస్యలు తీరాయని, అలాంటి సమస్యలను గుర్తించే ఏకైక పార్టీ బీజేపీ అని, అందుకే తాను ఆ పార్టీలో చేరుతున్నట్లు శశికళ చెప్పారు. గతంలో తూత్తుకుడి మేయర్, ఏఐఏడీఎంకే మహిళ విభాగ నాయకురాలిగా పనిచేసిన శశికళ రాజ్యసభ సభ్యత్వం ఏప్రిల్‌లో ముగియనుంది.

Tags:    

Similar News