ఎంపీల సస్పెన్షన్‌పై.. శశిథరూర్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ శశిథరూర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభలో వేటుకు గురైన 12 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేసే వరకు సన్సాద్ టీవీలో చేయనని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని సోమవారం వెల్లడించారు.‘ఒక ఎంపీగా ప్రతిరోజు నిరసన తెలుపుతున్న ఎంపీలకు మద్దతు ఇస్తున్నాను.సన్సాద్ టీవీలో ఒక షోను హోస్ట్ చేయడంలో నా నిరంతర ప్రమేయం నన్ను ఆందోళనకు గురిచేస్తుంది. పార్లమెంటరీ సంస్థల నిర్వహణలో అప్రజాస్వామిక పద్ధతిలో నన్ను భాగస్వామిగా చేస్తుందని […]
న్యూఢిల్లీ: కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ శశిథరూర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభలో వేటుకు గురైన 12 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేసే వరకు సన్సాద్ టీవీలో చేయనని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని సోమవారం వెల్లడించారు.‘ఒక ఎంపీగా ప్రతిరోజు నిరసన తెలుపుతున్న ఎంపీలకు మద్దతు ఇస్తున్నాను.సన్సాద్ టీవీలో ఒక షోను హోస్ట్ చేయడంలో నా నిరంతర ప్రమేయం నన్ను ఆందోళనకు గురిచేస్తుంది. పార్లమెంటరీ సంస్థల నిర్వహణలో అప్రజాస్వామిక పద్ధతిలో నన్ను భాగస్వామిగా చేస్తుందని భావిస్తున్నాను’ అని ప్రకటనలో చెప్పారు.
ప్రతిపక్షాలను పట్టించుకోకుండా ట్రెజరీ బెంచ్‌ల సభ్యులపై కెమెరాలు ఫోకస్ చేసే అలవాటుపై చాలా మంది ప్రతికూల వ్యాఖ్యలు చేశారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సన్సాద్ టీవీలో కొనసాగడం సమస్యగా పేర్కొన్నారు. కాగా, శశి థరూర్ ‘టూ ది పాయింట్’ అనే టాక్ షోలో వ్యాఖ్యాతగా చేస్తున్నారు. అంతకుముందు ఆదివారం ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా సన్సాద్ టీవీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.