నాకూ బ్రేకప్ ఉంది..అందుకే చేశా!

       ప్రతిఒక్కరి జీవితంలోనూ గెలుపోటములు సహజం. గెలిచినప్పుడు సంతోషం, ఓడిపోయినప్పుడు బాధ కూడా కామన్. అలాగే జీవితంలో అందరూ ప్రేమలో పడతారు. కానీ అందులో కొందరే సఫలమవుతారు. ప్రేమలో సక్సెస్ కంటే ఫెయిల్యూర్ అయినవారే నూటికి తొంభై శాతం మంది ఉంటారు. అలాగనీ జీవితం ముగిసిపోయినట్టు కాదు. ప్రేమలో విఫలమైన వారు జీవితంలో విజయం సాధించవచ్చు అందుకు బెస్ట్ ఉదాహరణ తానేనని ప్రముఖ సినీ నటుడు శర్వానంద్ వెల్లడించారు. ఆయన నటించిన యూత్ ఫుల్ […]

Update: 2020-02-09 02:53 GMT

ప్రతిఒక్కరి జీవితంలోనూ గెలుపోటములు సహజం. గెలిచినప్పుడు సంతోషం, ఓడిపోయినప్పుడు బాధ కూడా కామన్. అలాగే జీవితంలో అందరూ ప్రేమలో పడతారు. కానీ అందులో కొందరే సఫలమవుతారు. ప్రేమలో సక్సెస్ కంటే ఫెయిల్యూర్ అయినవారే నూటికి తొంభై శాతం మంది ఉంటారు. అలాగనీ జీవితం ముగిసిపోయినట్టు కాదు. ప్రేమలో విఫలమైన వారు జీవితంలో విజయం సాధించవచ్చు అందుకు బెస్ట్ ఉదాహరణ తానేనని ప్రముఖ సినీ నటుడు శర్వానంద్ వెల్లడించారు. ఆయన నటించిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ జాను సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకోవడంతో శర్వా ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది.

తమిళంలో హిట్ అయిన 96ను తెలుగులో దిల్‌రాజు నిర్మాణం, సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వా, సమంత హిరో, హిరోయిన్‌లుగా నటించిన ‘జాను’ ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1996బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు చదువుకునే సమయంలో ప్రేమించుకుని మధ్యలో విడిపోతారు. పెద్దయ్యాక ‘గెట్ టు గెదర్‌’లో కలుసుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది.. అనేదే కథ.. అయితే తన జీవితంలో ఎన్నడూ పడనంత కష్టం ఈ సినిమాలో పడాల్సి వచ్చిందని శర్వా తెలిపారు. కెన్యాలో షూటింగ్ సమయంలో తనకు గాయం అయినా త్వరగా కొలుకుని షూటింగ్ కంప్లీట్ చేశానన్నారు. కానీ
సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఇన్నాళ్లకు నా ఆకలి తీరిందని, తనకు ఈ సినిమా ఎంతో సంతృప్తినిచ్చిందని శర్వా అభిప్రాయం వ్యక్తంచేశారు.

కాగా, ఈ సినిమా చేయడానికి ముఖ్యకారణం తనకూ ఓ బ్రేకప్ ఉందని అదే తనను ఈ సినిమా చేసేలా ప్రోత్సహించిందేమో అని సరదాగా చెప్పుకొచ్చారు. అయితే వ్యక్తిగత విజయానికి, సినీ విజయానికి చాలా తేడా ఉంటుందన్నారు. వ్యక్తిగత జీవితంలో ఓడిపోతే అది మనకు ఒక్కరికే బాధ కల్గిస్తుందని కానీ, సినీ జీవితంలో ఓడిపోయినప్పుడల్లా మనల్ని అభిమానించే వారు కూడా నిరుత్సాహానికి గురిచేస్తుందని, అది ఇంకా ఎక్కువ బాధకు లోనయేలా చేస్తుందన్నారు. సినీ జీవితంలో విజయాలు, అపజయాలు కామన్ అయినా, కొన్ని సినిమాలు నటులకు తమ కెరీర్‌లోనే మంచి పేరు, ప్రతిష్టలు తీసుకొస్తాయని వివరించారు. జాను కూడా ఆ కోవకే చెందుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

ఇదిలా ఉండగా శర్వానంద్ తమిళం, తెలుగులో కలిపి సుమారు 30కి పైగా సినిమాల్లో నటించగా హిట్ టాక్ తెచ్చుకున్నవి వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. కానీ ఆ సినిమాలు శర్వాకు మంచిపేరును తీసుకొచ్చాయి. కొన్నిసినిమాలు ఆయనలోని నటన ప్రావీణ్యాన్ని బయటకు తీసుకురాగా, విమర్శకుల ప్రశంసలు అందుకునేలా చేశాయి. అందులో ముఖ్యంగా గమ్యం, ప్రస్థానం, మళ్లీమళ్లీ ఇది రాని రోజు, శతమానం భవతి మొదలగునవి ఉన్నాయి. ఇందులో నటన పరంగా గమ్యం, ప్రస్థానానికి మంచి గుర్తింపు రాగా, మిగతావి ఫ్యామిలీ ప్రేక్షకులకు శర్వాను దగ్గర చేశాయి. ప్రస్తుతం శర్వానంద్ ‘శ్రీకారం’ సినిమా చేస్తున్నారు. ఏప్రిల్‌ 24న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతేకాకుండా ఏడాదికి మూడు సినిమాలు చేసేలా తన కెరీర్‌ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Tags:    

Similar News