షారుఖ్ @28.. కంటిన్యూ
షారుఖ్ ఖాన్.. బాలీవుడ్ కా బడా ఔట్‌సైడర్, బాలీవుడ్ కా రొమాన్స్, బాలీవుడ్ కా బాద్‌షా. ఆయన ఎంట్రీ ఇండియన్ సినిమా క్రియేటివిటీని పెంచింది. ఆయన డెడికేషన్ మిలియన్స్ ఆఫ్ హార్ట్ బీట్‌గా మారింది. ఆయన హార్డ్‌వర్క్ సెల్ఫ్ మేడ్ లెజెండ్‌గా మార్చింది. ఆయన కల, పంచే ప్రేమ, చేసే నటన అభిమానులను మెస్మరైజ్ చేస్తూనే ఉంది. 28 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం.. తనను వరల్డ్ బిగ్గెస్ట్ స్టార్‌గా మార్చగా.. తనకు అన్నివేళలా సపోర్ట్‌గా నిలిచిన ఫ్యాన్స్‌కు […]
షారుఖ్ ఖాన్.. బాలీవుడ్ కా బడా ఔట్‌సైడర్, బాలీవుడ్ కా రొమాన్స్, బాలీవుడ్ కా బాద్‌షా. ఆయన ఎంట్రీ ఇండియన్ సినిమా క్రియేటివిటీని పెంచింది. ఆయన డెడికేషన్ మిలియన్స్ ఆఫ్ హార్ట్ బీట్‌గా మారింది. ఆయన హార్డ్‌వర్క్ సెల్ఫ్ మేడ్ లెజెండ్‌గా మార్చింది. ఆయన కల, పంచే ప్రేమ, చేసే నటన అభిమానులను మెస్మరైజ్ చేస్తూనే ఉంది. 28 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం.. తనను వరల్డ్ బిగ్గెస్ట్ స్టార్‌గా మార్చగా.. తనకు అన్నివేళలా సపోర్ట్‌గా నిలిచిన ఫ్యాన్స్‌కు బిగ్గెస్ట్ థాంక్స్ చెప్పారు షారుఖ్.
1992లో ‘దీవానా’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన షారుఖ్.. ఈ సినిమాలో రిషి కపూర్, దివ్య భారతి లాంటి స్టార్ యాక్టర్స్‌తో నటించారు. తొలి సినిమాతోనే సూపర్ అనిపించుకున్న షారుఖ్.. తన లుక్స్, యాటిట్యూడ్, యాక్టింగ్‌తో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ బాలీవుడ్ బాద్‌షాగా ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. షారుఖ్ ఒక్కసారి ‘గలే మిలావో’ పోజ్ పెడితే చాలు.. అభిమానులకు కన్నుల పండుగే. దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే, దిల్‌తో పాగల్ హై, స్వదేశ్, దేవ్‌దాస్, చక్ దే ఇండియా, కబీ ఖుషి కబీ గమ్, మై నేమ్ ఈజ్ ఖాన్, చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న తీరు ఆయన ఫాలోయింగ్‌కు నిదర్శనం. ముఖ్యంగా అమెరికా అధ్యక్షులు భారత్‌ను సందర్శిస్తే ముందుగా తలచుకునే ఇండియన్ సినిమా హీరో.. షారుఖ్. నాడు ఒబామా.. నేడు ట్రంప్.. ఎవరైనా సరే షారుక్‌కు ఫిదా అవ్వాల్సిందే.
14 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, పద్మశ్రీతో సత్కరించబడిన షారుఖ్.. ఫ్రాన్స్ దేశ అత్యున్నత పురస్కారం ‘లీజియన్ ఆఫ్ హానర్’తో గౌరవించబడ్డారు. ఇండియన్ డయాస్పోరగా గుర్తించబడ్డారు. నాకు ఇంత స్టేటస్ వచ్చింది కదా.. చాలా రిజర్వ్‌డ్‌గా ఉండాలనే నేచర్ చాలా మందిలో ఉంటుంది. కానీ షారుఖ్ అలా కాదు.. ప్రతీ మూమెంట్‌ను ఆస్వాదిస్తాడు.. ప్రతీ క్షణం ప్రేక్షకులను అలరించేందుకు ఆరాటపడతాడు. అంతేకాదు రెడ్ చిల్లీస్ నిర్మాణ సంస్థ ప్రారంభించిన షారుఖ్.. చిన్న సినిమాలను ప్రోత్సహిస్తూనే.. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సేవా కార్యక్రమాలు కూడా చేపట్టాడు.
జూన్ 28తో బాలీవుడ్ అరంగేట్రం చేసి 28 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా షారుఖ్ స్పెషల్ ట్వీట్ చేశారు. ‘నా అభిరుచి వృత్తిగా ఎప్పుడు మారిందో తెలియదు. ఇన్నేళ్లుగా మీకు ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు అనుమతించినందుకు ధన్యవాదాలు. నా వృత్తి నైపుణ్యం కంటే నా అభిరుచి.. మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించింది. 28 ఏళ్లు.. ఇంకా ఎన్నో’ అంటూ తన ప్రయాణం సాగుతుందని తెలిపిన షారుఖ్.. తనపై చూపించే అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.
28 years and counting… and thank u @gaurikhan for capturing this moment. https://t.co/UC8FZUiF5X
— Shah Rukh Khan (@iamsrk) June 28, 2020