సీతక్కకు షర్మిల సపోర్ట్

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి రాజన్న రాజ్య స్థాపన చేస్తానంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తనయ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పార్టీ ప్రకటనకు  ముందే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఖమ్మంలో భారీ బహిరంగ సభ, హైదరాబాద్‌లో ఉద్యోగ దీక్షలు నిర్వహించిన షర్మిల.. కొవిడ్ విజృంభణతో కేసీఆర్ సర్కార్‌పై పోరును ట్విట్టర్‌లో కొనసాగిస్తున్నారు. తాజాగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని నిరాహార దీక్ష చేస్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్కకు షర్మిల మద్దతు తెలిపారు.  సీతక్క […]

Update: 2021-04-27 06:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి రాజన్న రాజ్య స్థాపన చేస్తానంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తనయ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పార్టీ ప్రకటనకు ముందే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఖమ్మంలో భారీ బహిరంగ సభ, హైదరాబాద్‌లో ఉద్యోగ దీక్షలు నిర్వహించిన షర్మిల.. కొవిడ్ విజృంభణతో కేసీఆర్ సర్కార్‌పై పోరును ట్విట్టర్‌లో కొనసాగిస్తున్నారు. తాజాగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని నిరాహార దీక్ష చేస్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్కకు షర్మిల మద్దతు తెలిపారు. సీతక్క దీక్షను పోలీసులు భగ్నం చేయడాన్ని ఖండించారు.

కేసీఆర్‌పై సెటైర్లు

ఒక మహిళగా సీతక్క ప్రజల పక్షాన నిలబడటంపై అభినందించిన షర్మిల.. తమ మద్దతు కూడా ఉంటుందని ట్వీట్ చేశారు. ‘ప్రశ్నించడమే నచ్చని పెద్దమనిషి కేసీఆర్‌కు ఒక మహిళ లేచి నిలబడి పోరాటం చేస్తుంటే నచ్చుతుందా?’ అంటూ సెటైర్లు వేశారు. మహిళా వ్యతిరేకిగా పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్‌కు మహిళల ఆధ్వర్యంలో చేపట్టబోయే ఉద్యమాలే బుద్ధి చెబుతాయని పేర్కొన్నారు. షర్మిల ట్వీట్లకు నెటిజన్లు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని దొర జగన్‌కు కూడా ఇలాంటి సలహాలివ్వండంటూ కౌంటర్లు ఇస్తున్నారు.

Tags:    

Similar News