లాకప్ డెత్.. పోలీసులే కొట్టి చంపారని ఆందోళన
దిశ, వెబ్డెస్క్: దొంగతనం కేసులో నిందితురాలిగా పోలీసుల అదుపులో ఉన్న మహిళ లాకప్ డెత్ అయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చర్చనీయాంశం అయింది. ఈ వ్యవహారంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ తీవ్ర ఆందోళన చేపట్టింది. ప్రజా సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించి పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ రాంరెడ్డి డిమాండ్ చేశారు. కార్యకర్తలతో కలిసి అడ్డ గూడూరు మండలం రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల దెబ్బలు తాళలేకనే మరియమ్మ మృతి చెందిందని ఆరోపించారు. ఇక […]
దిశ, వెబ్డెస్క్: దొంగతనం కేసులో నిందితురాలిగా పోలీసుల అదుపులో ఉన్న మహిళ లాకప్ డెత్ అయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చర్చనీయాంశం అయింది. ఈ వ్యవహారంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ తీవ్ర ఆందోళన చేపట్టింది. ప్రజా సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించి పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ రాంరెడ్డి డిమాండ్ చేశారు. కార్యకర్తలతో కలిసి అడ్డ గూడూరు మండలం రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల దెబ్బలు తాళలేకనే మరియమ్మ మృతి చెందిందని ఆరోపించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను పోలీస్ స్టేషన్కు తరలించారు.