వైఎస్ఆర్ టీపీలోకి నాయకులను ఆహ్వానించిన షర్మిల

దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్సార్ తెలంగాణ పార్టీని అధికారికంగా ప్రకటించిన షర్మిల క్రమంగా ముందడుగులు వేస్తున్నారు. లోటస్ పాండ్‌లో శుక్రవారం వైఎస్సార్ టీపీకి చెందిన అధికార ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. పార్టీని గ్రామీణ స్థాయి వరకు బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చలు జరిగినట్లు లోటస్ పాండ్ వర్గీయులు చెబుతున్నారు. అలాగే జిల్లాల వారీగా కమిటీలు వేయడం, ఇతర అంశాలపై సమావేశం కొనసాగినట్లు తెలుస్తోంది. అనంతరం వైఎస్సార్ టీపీ అధికార ప్రతినిధులు పిట్టా రాంరెడ్డి, […]

Update: 2021-07-09 08:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్సార్ తెలంగాణ పార్టీని అధికారికంగా ప్రకటించిన షర్మిల క్రమంగా ముందడుగులు వేస్తున్నారు. లోటస్ పాండ్‌లో శుక్రవారం వైఎస్సార్ టీపీకి చెందిన అధికార ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. పార్టీని గ్రామీణ స్థాయి వరకు బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చలు జరిగినట్లు లోటస్ పాండ్ వర్గీయులు చెబుతున్నారు. అలాగే జిల్లాల వారీగా కమిటీలు వేయడం, ఇతర అంశాలపై సమావేశం కొనసాగినట్లు తెలుస్తోంది.

అనంతరం వైఎస్సార్ టీపీ అధికార ప్రతినిధులు పిట్టా రాంరెడ్డి, భూమి రెడ్డి, వైఎస్సార్ అభిమానులు, నాయకులు, ఇతర నేతలకు షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ముఖ్య నేతలకు పార్టీకి సంబంధించిన జెండాలు అందించారు.

ఇదిలా ఉండగా గురువారం జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆర్గనైజర్లపై వైఎస్ షర్మిల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. జన సమీకరణ చేయడంలో ఫెయిలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ ప్రకటన సమయానికి హాల్ జనంతో నిండటంతో ఆమె సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Tags:    

Similar News