షర్మిల అభిమానులు కొవ్వొత్తుల ర్యాలీ
దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్ షర్మిల తలపెట్టిన 72 గంటల ‘ఉద్యోగ దీక్ష’ ఆదివారం ఉదయం 11 గంటలకు ముగియనుంది. ఈ మూడు రోజుల దీక్షలో ఆమె 1.900 కిలోల బరువు తగ్గారని, షుగర్ లెవల్ కూడా 88 నుంచి 62కు తగ్గినట్లు ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఇందిరా పార్కు దగ్గర ఆమె గురువారం చేపట్టిన ‘ఉద్యోగ దీక్ష‘కు పోలీసులు కేవలం ఒక్క రోజే అనుమతి ఇవ్వడంతో మిగిలిన రెండు రోజులు […]
దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్ షర్మిల తలపెట్టిన 72 గంటల ‘ఉద్యోగ దీక్ష’ ఆదివారం ఉదయం 11 గంటలకు ముగియనుంది. ఈ మూడు రోజుల దీక్షలో ఆమె 1.900 కిలోల బరువు తగ్గారని, షుగర్ లెవల్ కూడా 88 నుంచి 62కు తగ్గినట్లు ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఇందిరా పార్కు దగ్గర ఆమె గురువారం చేపట్టిన ‘ఉద్యోగ దీక్ష‘కు పోలీసులు కేవలం ఒక్క రోజే అనుమతి ఇవ్వడంతో మిగిలిన రెండు రోజులు ఆమె తన నివాసమైన లోటస్ పాండ్‌లో కొనసాగిస్తున్నారు. మూడు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో నీరసంగా ఉన్నారని, ఆ కారణంగానే షుగర్ లెవెల్ తగ్గిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఫ్లూయిడ్స్ తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించినప్పటికీ ఆమె అందుకు నిరాకరించారు.
మరోవైపు ఆమె దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో అక్కడకు చేరుకుంటున్నారు. నిరుద్యోగి సునీల్ ఆత్మహత్య అంశంపై వివిధ జిల్లాల నుంచి వచ్చిన షర్మిల అభిమానులు లోటస్ పాండ్ దగ్గర శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సునీల్ నాయక్ చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగానే సునీల్ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని ఆరోపించిన షర్మిల అభిమానులు.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.