36 వేల మార్కు చేరుకున్న సెన్సెక్స్!
దిశ, వెబ్‌డెస్క్: వారాంతానికి దేశీ ఈక్విటీ మార్కెట్లు వరుస లాభాలను నమోదు చేశాయి. మదుపర్లు కొనుగోళ్లకు ఎక్కువ ఆసక్తి చూపించడంతో ఉదయం నుంచే సానుకూల కదలికలతో మూడోరోజూ మార్కెట్లు జోరందుకున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ వార్తలకు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రోత్సాహం తోడవడంతో దేశీయంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడిందని నిపుణులు భావిస్తున్నారు. మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,106 పాయింట్లను దక్కించుకోవడంతో కరోనాకు ముందున్న 36,000 పాయింట్ల మార్కును అధిగమించింది. దీంతో సెన్సెక్స్ 177.72 పాయింట్ల లాభంతో 36,021 వద్ద ముగియగా, […]
దిశ, వెబ్‌డెస్క్: వారాంతానికి దేశీ ఈక్విటీ మార్కెట్లు వరుస లాభాలను నమోదు చేశాయి. మదుపర్లు కొనుగోళ్లకు ఎక్కువ ఆసక్తి చూపించడంతో ఉదయం నుంచే సానుకూల కదలికలతో మూడోరోజూ మార్కెట్లు జోరందుకున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ వార్తలకు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రోత్సాహం తోడవడంతో దేశీయంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడిందని నిపుణులు భావిస్తున్నారు. మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,106 పాయింట్లను దక్కించుకోవడంతో కరోనాకు ముందున్న 36,000 పాయింట్ల మార్కును అధిగమించింది. దీంతో సెన్సెక్స్ 177.72 పాయింట్ల లాభంతో 36,021 వద్ద ముగియగా, నిఫ్టీ 55.65 పాయింట్లు లాభపడి 10,607 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఆటో, టీసీఎస్, టైటాన్, హెచ్‌సీఎల్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, ఇండస్ఇండ్, టాటాస్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, నెస్లె ఇండియా షేర్లు నష్టాల్లో కదలాడాయి.