సీఎం లాక్‌డౌన్ ప్రకటనపై షబ్బీర్ అలీ ఫైర్

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కట్టడి పేరుతో సీఎం కేసీఆర్ గంటల వ్యవధితోనే లాక్ డౌన్ ప్రకటించడంపై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మహ్మద్ షబ్బీర్ అలీ మండిపడ్డారు. మంగళవారం అయన వర్చువల్ పద్దతిన మీడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్‌ ప్రకటన చేసి ప్రజల్ని గందరగోళానికి గురిచేశారని ఆరోపించారు. ప్రజలను అంధకారంలో ఉంచడం కేసీఆర్‌‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. చాలా సులభంగా, అలవొకగా అబద్ధాలు మాట్లాడుతారని, మాటల గారడీతో కేసీఆర్‌ చెప్పేవన్నీ నిజమేనని అమాయక ప్రజలు […]

Update: 2021-05-11 09:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కట్టడి పేరుతో సీఎం కేసీఆర్ గంటల వ్యవధితోనే లాక్ డౌన్ ప్రకటించడంపై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మహ్మద్ షబ్బీర్ అలీ మండిపడ్డారు. మంగళవారం అయన వర్చువల్ పద్దతిన మీడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్‌ ప్రకటన చేసి ప్రజల్ని గందరగోళానికి గురిచేశారని ఆరోపించారు. ప్రజలను అంధకారంలో ఉంచడం కేసీఆర్‌‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. చాలా సులభంగా, అలవొకగా అబద్ధాలు మాట్లాడుతారని, మాటల గారడీతో కేసీఆర్‌ చెప్పేవన్నీ నిజమేనని అమాయక ప్రజలు భావించేలా చేయడం ఆయనకు పరిపాటి అని దుయ్యబట్టారు.

లాక్‌డౌన్‌ అవసరం లేదని, లాక్‌డౌన్‌ వల్ల ప్రయోజనం లేదని ప్రకటించి ప్రజల్నికేసీఆర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ ‌లు తప్పుదారి పట్టించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం గంటల వ్యవధిలోనే 10 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించిందని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల కోసం జనం ఒక్కసారిగా జనం వీధుల్లోకి వస్తే కరోనా వ్యాప్తి చెందుతుందని ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. లాక్‌డౌన్‌ కాలంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలతోపాటు మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. నిత్యావసర వస్తువులు, ఇతర అత్యవసర సేవల ధరలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలందరికీ ఉచిత కరోనా వైద్య చికిత్సలను రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని, కరోనా తో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News