లైంగిక వేధింపుల కేసులో రాఖీ కట్టి, స్వీట్‌ పెట్టారు

దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపుల కేసు చర్చనీయాంశంగా మారింది. రోడ్ల భవనాల శాఖకు చెందిన ఓ ఇంజనీర్ తోటి ఉద్యోగినిని మానసికంగా, లైంగికంగా వేధించాడు. ఇది తెలుసుకున్న బాధితురాలి కుటుంబీకులు సర్కిల్ కార్యాలయంలోనే చితక బాదారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు జిల్లా ఎస్‌ఈకి సైతం వివరించింది. చివరకు మహిళ చేత సదరు ఇంజనీర్‌కు రాఖీ కట్టించి […]

Update: 2021-09-10 07:01 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపుల కేసు చర్చనీయాంశంగా మారింది. రోడ్ల భవనాల శాఖకు చెందిన ఓ ఇంజనీర్ తోటి ఉద్యోగినిని మానసికంగా, లైంగికంగా వేధించాడు. ఇది తెలుసుకున్న బాధితురాలి కుటుంబీకులు సర్కిల్ కార్యాలయంలోనే చితక బాదారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు జిల్లా ఎస్‌ఈకి సైతం వివరించింది. చివరకు మహిళ చేత సదరు ఇంజనీర్‌కు రాఖీ కట్టించి స్వీట్ తినిపించేసి కాంప్రమైస్ చేసినట్టు తెలిసింది.

కనీసం వేధింపులు పాల్పడినందుకు చట్టప్రకారం చర్యలు తీసుకోకపోగా.. ఆర్ అండ్ బీ శాఖ నుంచి ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో దుమారం రేగింది. మహిళల భద్రతా విషయంలో అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. లైంగిక వేధింపుల కేసులో కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు, అధికారులు నీరు గార్చడం ఏంటని బాధితురాలు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత శాఖలో ఈ వ్యవహారం జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News