నిమిషం కూడా సెక్స్ చేయలేకపోతున్నాడు.. నాలో ఏవేవో ఆలోచనలు పిచ్చిదాన్ని చేస్తున్నాయి!

నా వయసు 29. మా ఆయన వయసు 36. ఆయన నాకు మేనమామ. నాకు పద్నాలుగేళ్లప్పుడు మా పెళ్లయ్యింది. మాకు ముగ్గురు పిల్లలు.

Update: 2024-10-14 14:10 GMT

నా వయసు 29. మా ఆయన వయసు 36. ఆయన నాకు మేనమామ. నాకు పద్నాలుగేళ్లప్పుడు మా పెళ్లయ్యింది. మాకు ముగ్గురు పిల్లలు. ఆయన బాగా తాగుతాడు. ఎంత ప్రయత్నించినా తాగుడు మాన్పించ లేకపోయాను. ఓ ఏడాది క్రితం తనకు సెక్స్ లోపం వచ్చింది. ఓ నిమిషం కూడా చేయలేక పోతున్నాడు. దాంతో ఏదో నాటుమందు వేసుకున్నాడు. అప్పట్నుంచీ పూర్తిగా కోరిక లేకుండా పోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్లమంటే వినట్లేదు. నాకు మనశ్శాంతిగా లేదు. టెన్షన్‌గా, బాధగా ఉంటోంది. ఏవేవో ఆలోచనలు పిచ్చిదాన్ని చేస్తున్నాయి. ఏం చేయాలో అర్థంకావట్లేదు. సలహా ఇవ్వండి.

మీవారి అంగస్తంభన లోపానికి, శీఘ్రస్ఖలనానికి ఆయన తాగుడే కారణం. దీర్ఘకాలంగా ఆల్కహాల్ తీసుకోవడం వలన పురుష శృంగార హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్, కాలేయంలో స్త్రీ శృంగార హార్మోన్ అయిన ఈస్ట్రోజన్‌గా మారిపోతుంది. దాని వల్ల టెస్టోస్టిరాన్ స్థాయి పడిపోతుంది. ఫలితంగా అంగస్తంభనతో పాటు, పురుషుల్లో వక్షోజాలు వృద్ధి చెందే స్థితి (గైనకోమాస్టియా) వస్తుంది. విపరీతంగా లావు అవడంతో పాటు శృంగార కోరికలు కూడా తగ్గిపోతాయి. చాలామంది పురుషులు తాగినందువల్ల శృంగారంలో ఎక్కువసేపు చురుగ్గా పాల్గొనవచ్చని అనుకుంటారు. అది పూర్తిగా తప్పు. తాగుడు వల్ల మస్తిష్కం మీద అదుపు తప్పి, విచక్షణ, సిగ్గు, అవమానం, సంఘ భయం వంటి అనేక మానసిక అవరోధాలు తొలగి పోవడం వల్ల, స్వేచ్ఛగా శృంగారంలో పాల్గొంటారు తప్పితే... దీనికి శాస్త్రీయ కారణాలు ఏమీ లేవు. మీ భర్త నాటుమందు వేసుకోవడం కాదు, ముందు తాగుడు మానెయ్యాలి. తనను మంచి ఆల్కహాల్ అడిక్షన్ సెంటర్లో చేర్చించండి. అలాగే సెక్సాలజిస్టుతో చర్చించి, తాగుడు వల్ల వచ్చే శృంగార వైఫల్యాల గురించి కౌన్సెలింగ్ ఇప్పించండి. తాగుడు వల్ల ఒక్క సెక్స్ సమస్యే కాదు. అనేక ప్రాణాంతర వ్యాధులు వస్తాయి. సంఘ, కుటుంబ సంబంధాలు దెబ్బ తినటమే కాక, ఆర్థిక పరమైన నష్టాలు కూడా వస్తాయి. టెన్షన్ పడకుండా ఓ ప్రణాళిక ప్రకారం నేను చెప్పినట్టు చెయ్యండి.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Read More : ఈ వక్షోజాలతో బయటకు వెళ్లాలంటేనే సిగ్గుగా ఉంది


Similar News