కశ్మీర్‌లో ఏడుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో భద్రతా బలగాలు మొత్తం ఏడుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇందులో అన్సర్ గజావత్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ ఇంతియాజ్ షానూ హతమయ్యారు. పుల్వామా జిల్లాలోని త్రాల్ ఏరియాలో, షోపియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్లు జరిగాయి. షోపియాన్ జిల్లాలో తెల్లవారుజామునే మొదలైన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో పోలీసులు మట్టుబెట్టారు. కాగా, త్రాల్ ఏరియాలో ఇంతియాజ్ షాతోపాటు మరో ఉగ్రవాదిని అంతమొందించాయి. వీరి నుంచి ఏడు ఏకే47లు, […]

Update: 2021-04-09 04:21 GMT

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో భద్రతా బలగాలు మొత్తం ఏడుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇందులో అన్సర్ గజావత్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ ఇంతియాజ్ షానూ హతమయ్యారు. పుల్వామా జిల్లాలోని త్రాల్ ఏరియాలో, షోపియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్లు జరిగాయి. షోపియాన్ జిల్లాలో తెల్లవారుజామునే మొదలైన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో పోలీసులు మట్టుబెట్టారు. కాగా, త్రాల్ ఏరియాలో ఇంతియాజ్ షాతోపాటు మరో ఉగ్రవాదిని అంతమొందించాయి. వీరి నుంచి ఏడు ఏకే47లు, రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నట్టు జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. మొత్తం ఏడుగురు ఉగ్రవాదుల హతంతో అన్సర్ గజావత్ ఉల్ హింద్ సంస్థను పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని వివరించారు.

Tags:    

Similar News