మిల్లులో సీక్రెట్ సిట్టింగ్ వేసిన జూదగాళ్లు.. ఏడుగురు అరెస్టు

దిశ, నర్సంపేట : పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మహేశ్వరం గ్రామంలో కొందరు వ్యక్తులు శనివారం సాయంత్రం గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నర్సంపేట పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 34వేల నగదు, 4 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.ఈ […]

Update: 2021-11-13 10:04 GMT

దిశ, నర్సంపేట : పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మహేశ్వరం గ్రామంలో కొందరు వ్యక్తులు శనివారం సాయంత్రం గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నర్సంపేట పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి రూ. 34వేల నగదు, 4 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.ఈ విషయంపై ఎస్సై రవీందర్‌ను వివరణ కోరగా మహేశ్వరం గ్రామంలోని మిల్లులో (అమృత నారాయణ ఇండస్ట్రీ) పేకాట ఆడుతున్నట్టు సమాచారం రావడంతో వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు తెలిపారు. ఈ మిల్లు కొంత కాలంగా మూసివేసి ఉందని, దీంతో మహేశ్వరానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ మిల్లులో పేకాట డెన్‌ను ఏర్పాటు చేసి కార్డ్స్ ఆడుతున్నారని తెలిపారు. స్థానికులు ఏడుగురు ప్రస్తుతం తమ అదుపులో ఉన్నారని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags:    

Similar News