అగ్ని ప్రమాద నష్టం రూ.1000 కోట్లు : పూనావాలా

దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలోని పూణెలో ఉన్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా టెర్మినల్ గేట్ -1లో జరిగిన అగ్ని ప్రమాదంపై కంపెనీ చైర్మన్, సీఈవో అదర్ పూనావాలా స్పందించారు. ఫైర్ యాక్సిడెంట్ వలన సంభవించిన నష్టం విలువ రూ.1000 కోట్లు ఉంటుందని గురువారం ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదం వలన కరోనా వ్యాక్సిన్‌ (కోవిషీల్డ్)కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని.. ఆ సమయంలో అక్కడి ప్లాంట్‌లో టీకా తయారీ జరగడం లేదని వివరించారు. ఇదిలాఉండగా సీరమ్ కంపెనీలో […]

Update: 2021-01-22 08:51 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలోని పూణెలో ఉన్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా టెర్మినల్ గేట్ -1లో జరిగిన అగ్ని ప్రమాదంపై కంపెనీ చైర్మన్, సీఈవో అదర్ పూనావాలా స్పందించారు. ఫైర్ యాక్సిడెంట్ వలన సంభవించిన నష్టం విలువ రూ.1000 కోట్లు ఉంటుందని గురువారం ఆయన వెల్లడించారు.

ఈ ప్రమాదం వలన కరోనా వ్యాక్సిన్‌ (కోవిషీల్డ్)కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని.. ఆ సమయంలో అక్కడి ప్లాంట్‌లో టీకా తయారీ జరగడం లేదని వివరించారు. ఇదిలాఉండగా సీరమ్ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News