రెగ్యులర్​ చేయండి.. సెర్ప్ ఉద్యోగులు డిమాండ్

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఐకేపీలో పని చేస్తున్న 4156 మంది ఉద్యోగులను రెగ్యులర్​ చేయాలని సెర్ప్​ ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు కుంట గంగాధర్​రెడ్డి, ఏపూరి నర్సయ్య, సుభాష్​, మహేందర్​రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర కేబినెట్​ భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్​కు విజ్ఞప్తి చేశారు. 21 ఏండ్ల నుంచి రాష్ట్రంలోని గ్రామీణ నిరుపేదల మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వ మార్గదర్శకాల్లో పని చేస్తున్నామని, గతంలో ఎన్నికల సందర్భంగా సెర్ప్​ ఉద్యోగులను రెగ్యులర్​ చేస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారని ఈ […]

Update: 2021-07-14 06:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఐకేపీలో పని చేస్తున్న 4156 మంది ఉద్యోగులను రెగ్యులర్​ చేయాలని సెర్ప్​ ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు కుంట గంగాధర్​రెడ్డి, ఏపూరి నర్సయ్య, సుభాష్​, మహేందర్​రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర కేబినెట్​ భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్​కు విజ్ఞప్తి చేశారు. 21 ఏండ్ల నుంచి రాష్ట్రంలోని గ్రామీణ నిరుపేదల మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వ మార్గదర్శకాల్లో పని చేస్తున్నామని, గతంలో ఎన్నికల సందర్భంగా సెర్ప్​ ఉద్యోగులను రెగ్యులర్​ చేస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అసెంబ్లీలో కూడా గవర్నర్​ ప్రసంగంలో ప్రభుత్వం తరుపున గవర్నర్​ సెర్ప్​ ఉద్యోగులను రెగ్యులర్​ చేస్తామని ప్రత్యేకంగా ప్రస్తావించారన్నారు.

దీంతో రాష్ట్రంలో సెర్ప్​ ఉద్యోగులు రెట్టంచిన ఉత్సాహంతో పని చేశారని, ఏకంగా రూ. 10 వేల కోట్ల రుణాలు ఇప్పించి రికార్డు సాధించామని, తిరిగి వాయిదాల చెల్లింపుల్లో కూడా ముందున్నామని వివరించారు. మరోపక్క వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్రం జాతీయస్థాయి రికార్డు సాధించడంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా సెర్ప్​ ఉద్యోగులు కీలకమైన పాత్రను పోషించారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 56 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని, ఐకేపీలోని 4156 మంది ఉద్యోగులను రెగ్యులర్​ చేయాలని వారు కోరారు.

Tags:    

Similar News