తాజ్ సందర్శనకు గ్రీన్ సిగ్నల్!

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వింతల్లో ఒకటైన ఆగ్రాలోని తాజ్‌మహాల్ సందర్శనకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దేశంలో కరోనా కేసులు ప్రారంభం అయ్యాక కేంద్రం ప్రభుత్వం మార్చి నుంచి లాక్‌డౌన్ విధించింది. ఆ తర్వాత, అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా కొన్నింటిపై ఆంక్షలు నెమ్మదిగా సడలించినా.. పర్యాటకరంగంపై ఇన్నిరోజులు నిర్భంధం కొనసాగుతూనే ఉంది. తాజాగా సెప్టెంబర్ 1నుంచి పర్యాటకులను అనుమతించేందుకు పురావస్తుశాఖ అనుమతులు మంజూరు చేసింది. దీంతో కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే.. తాజ్ మహాల్, ఫతేపూర్ సిక్రీలను పర్యాటకుల […]

Update: 2020-08-20 10:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వింతల్లో ఒకటైన ఆగ్రాలోని తాజ్‌మహాల్ సందర్శనకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దేశంలో కరోనా కేసులు ప్రారంభం అయ్యాక కేంద్రం ప్రభుత్వం మార్చి నుంచి లాక్‌డౌన్ విధించింది.

ఆ తర్వాత, అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా కొన్నింటిపై ఆంక్షలు నెమ్మదిగా సడలించినా.. పర్యాటకరంగంపై ఇన్నిరోజులు నిర్భంధం కొనసాగుతూనే ఉంది.

తాజాగా సెప్టెంబర్ 1నుంచి పర్యాటకులను అనుమతించేందుకు పురావస్తుశాఖ అనుమతులు మంజూరు చేసింది. దీంతో కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే.. తాజ్ మహాల్, ఫతేపూర్ సిక్రీలను పర్యాటకుల సందర్శనకు సిద్ధంగా ఉంచాలని ఆగ్రా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News