మీటూ అభియోగాలు.. సియోల్ మేయర్ ఆత్మహత్య

సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్ మేయర్, దేశాధ్యక్ష పదవి రేసులో ఉన్న పార్క్ వొన్ సూన్ తనపై మీటూ అభియోగాలు వచ్చిన తర్వాతి రోజే ఆత్మహత్య చేసుకున్నారు. మాజీ పర్సనల్ సెక్రెటరీ సూన్‌పై లైంగికవేధింపుల ఆరోపణలు చేశారు. తనను హగ్ చేసుకోవాలని, వర్క్ అవర్స్ అయిపోయాక తన అసభ్యకర చిత్రాలను మెస్సెజింగ్ యాప్‌లో పంపారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కోసం, సియోల్ కోసం, దేశ ప్రయోజనాల కోసం ఈ ఫిర్యాదు చేస్తున్నట్టు ఆమె […]

Update: 2020-07-10 03:19 GMT

సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్ మేయర్, దేశాధ్యక్ష పదవి రేసులో ఉన్న పార్క్ వొన్ సూన్ తనపై మీటూ అభియోగాలు వచ్చిన తర్వాతి రోజే ఆత్మహత్య చేసుకున్నారు. మాజీ పర్సనల్ సెక్రెటరీ సూన్‌పై లైంగికవేధింపుల ఆరోపణలు చేశారు. తనను హగ్ చేసుకోవాలని, వర్క్ అవర్స్ అయిపోయాక తన అసభ్యకర చిత్రాలను మెస్సెజింగ్ యాప్‌లో పంపారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కోసం, సియోల్ కోసం, దేశ ప్రయోజనాల కోసం ఈ ఫిర్యాదు చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ దేశంలో పార్క్ వొన్ సూన్ మీటూ ఆరోపణల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న హైప్రొఫైల్ పొలిటీషియన్. బలమైన పితృస్వామ్య వ్యవస్థ గల ఈ దేశంలో లైంగిక ఆరోపణలు వచ్చిన కారణంగా చాలా మంది ప్రముఖులు ప్రాణాలు తీసుకున్నారు. సూన్ స్వదస్తూరితో సూసైడ్ నోట్ రాసుకున్నారు. అందరికీ క్షమాపణలు చెబుతూ, తన అస్థికలను తల్లిదండ్రుల సమాధుల దగ్గర ఉంచాలని కోరాడు. తన కుటుంబీకులకు క్షమాపణలు చెప్పారు. సియోల్‌ను దాదాపు దశాబ్ద కాలంగా రూల్ చేస్తున్న సూన్ దక్షిణ కొరియా మిలిటరీ పాలనలో ఉద్యమాలు చేసి ఎన్నోసార్లు జైలుకెళ్లారు. సామాజిక కార్యకర్తగా పనిచేశారు. మానవ హక్కుల న్యాయవాదిగా ఎంతోమంది కార్యకర్తల పక్షాన నిలిచారు. తర్వాత సియోల్ మేయర్‌గా తిరుగులేకుండా రాణిస్తున్న సూన్ ప్రస్తుత దేశాధ్యక్షుడిని 2022లో గద్దె దింపుతానని బాహాటంగా ప్రకటించేవారు.

Tags:    

Similar News