స్వల్ప లాభాల్లో మార్కెట్లు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కొవిడ్-19 వ్యాప్తి కారణంగా అంతర్జాతీయంగా మార్కెట్లు నీరసించాయి. ఆ ప్రభావంతో పాటు దేశీయంగా ఇటీవల లభించిన భారీ లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు సిద్ధపడటంతో మార్కెట్లు నష్టాల్లో ట్రేడైనప్పటికీ బ్యాంకింగ్ షేర్ల అండతో తిరిగి లాభాలను దక్కించుకున్నాయి. దీపావళి సందర్భంగా శనివారం సాయంత్రం 6.15 నుంచి 7.15 మధ్య గంటపాటు ముహురత్ ట్రేడింగ్‌ను నిర్వహించనున్నారు. ప్రతి ఏటా దీపావళి సందర్భంగా ముహురత్ […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కొవిడ్-19 వ్యాప్తి కారణంగా అంతర్జాతీయంగా మార్కెట్లు నీరసించాయి. ఆ ప్రభావంతో పాటు దేశీయంగా ఇటీవల లభించిన భారీ లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు సిద్ధపడటంతో మార్కెట్లు నష్టాల్లో ట్రేడైనప్పటికీ బ్యాంకింగ్ షేర్ల అండతో తిరిగి లాభాలను దక్కించుకున్నాయి. దీపావళి సందర్భంగా శనివారం సాయంత్రం 6.15 నుంచి 7.15 మధ్య గంటపాటు ముహురత్ ట్రేడింగ్‌ను నిర్వహించనున్నారు.
ప్రతి ఏటా దీపావళి సందర్భంగా ముహురత్ ట్రేటింగ్ జరపడం స్టాక్ ఎక్స్ఛేంజీల ఆనవాయితీ అనే విషయం తెలిసిందే. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 85.81 పాయింట్లు లాభపడి 43,443 వద్ద ముగియగా, నిఫ్టీ 29.15 పాయింట్ల లాభంతో 12,179 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్, రియల్టీ, మెటల్, ఫార్మా రంగాలు బలపడగా, మీడియా రంగం నీరసించింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, ఆల్ట్రా సిమెంట్ షేర్లు లాభపడగా, ఎల్అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.59 వద్ద ఉంది.