రికార్డులు బద్దలు కొట్టిన ఈక్విటీ మార్కెట్లు..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి రికార్డులను బద్దలు కొట్టింది. గత నాలుగు సెషన్లలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ గురువారం సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు పటిష్టమైన మద్దతివ్వడంతో సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను మార్చే అవకాశం లేదనే అంచనాలకు తోడు, చైనాకు చెందిన స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండ్ సంక్షోభంపై వివరణ ఇవ్వడంతో పెట్టుబడిదారులు దూకుడు పెంచారు. ఉదయం ప్రారంభం నుంచే లాభాలతో ర్యాలీ చేసిన స్టాక్ […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి రికార్డులను బద్దలు కొట్టింది. గత నాలుగు సెషన్లలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ గురువారం సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు పటిష్టమైన మద్దతివ్వడంతో సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను మార్చే అవకాశం లేదనే అంచనాలకు తోడు, చైనాకు చెందిన స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండ్ సంక్షోభంపై వివరణ ఇవ్వడంతో పెట్టుబడిదారులు దూకుడు పెంచారు. ఉదయం ప్రారంభం నుంచే లాభాలతో ర్యాలీ చేసిన స్టాక్ మార్కెట్లకు అంతర్జాతీయ వార్తలు, దేశీయంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, రియల్టీ రంగాల్లో భారీగా లాభాలు కలిసొచ్చాయి. ఓ దశలో 900 పాయింట్లకు పైగా ర్యాలీ చేసిన సెన్సెక్స్ 60 వేలకు చేరువగా, ఇంట్రాడే గరిష్ఠాలైన 59,947 పాయింట్లను తాకాయి. అనంతరం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 958.03 పాయింట్లు ఎగసి 59,885 వద్ద క్లోజయింది.
నిఫ్టీ 276.30 పాయింట్లు పెరిగి 17,822 వద్ద ముగిసింది. నిఫ్టీలో రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 9 శాతం పుంజుకుంది. ప్రముఖ సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలను సాధించిన తర్వాత రియల్టీ రంగం భారీగా లాభపడింది. ఇక, మీడియా, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో డా. రెడ్డీస్, ఐటీసీ, నెస్లె ఇండియా, హిందూస్తాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టాలను చూడగా, మిగిలిన అన్ని షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు అత్యధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.71 వద్ద ఉంది.