మదుపర్ల ఆసక్తి.. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు 

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు తిరిగి జోరును పెంచాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు తీవ్ర ఒడిదుడుకుల నుంచి చివరికి అధిక లాభాలను సాధించాయి. గతవారం వరుస నాలుగు సెషన్ల తర్వాత సోమవారం స్వల్పంగా కోలుకున్న స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను సాధించాయి. ముఖ్యంగా ఆటో, మెటల్, రియల్టీ రంగాల్లో మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో మార్కెట్ల లాభాలు పుంజుకున్నాయి. దేశీయ సంఘటనలకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలతో […]

Update: 2021-10-26 06:40 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు తిరిగి జోరును పెంచాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు తీవ్ర ఒడిదుడుకుల నుంచి చివరికి అధిక లాభాలను సాధించాయి. గతవారం వరుస నాలుగు సెషన్ల తర్వాత సోమవారం స్వల్పంగా కోలుకున్న స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను సాధించాయి. ముఖ్యంగా ఆటో, మెటల్, రియల్టీ రంగాల్లో మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో మార్కెట్ల లాభాలు పుంజుకున్నాయి.

దేశీయ సంఘటనలకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 383.21 పాయింట్లు ఎగసి 61.350 వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు పెరిగి 18,268 వద్ద ముగిసింది.

నిఫ్టీలో బ్యాంకింగ్ రంగం మినహాయించి ఆటో, రియల్టీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు భారీగా రికవరీని సాధించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, టైటాన్, నెస్లె ఇండియా, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్, రిలయన్స్, ఆల్ట్రా సిమెంట్, ఏషియన్ పెయింట్ షేర్లు అధిక లాభాలను దక్కించుకున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్, హిందూస్తాన్ యూనిలీవర్, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.91 వద్ద ఉంది.

Tags:    

Similar News