బడ్జెట్ కిక్కులో మార్కెట్లు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లలో బడ్జెట్ ఉత్సాహం కొనసాగుతోంది. సోమవారం నాటి బడ్జెట్‌లో మార్కెట్లకు హుషారునిచ్చే కీలక ప్రకటనలు చేయడంతో భారీగా ఎగిశాయి. అనంతరం మంగళవారం సైతం సూచీలు అదే స్థాయిలో జోరును పెంచాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్లు అత్యధికంగా ర్యాలీ చేయడంతో మార్కెట్లలో జోష్ పెరిగింది. కొత్త బడ్జెట్ ఇచ్చిన బూస్టప్‌తో ఉదయం నుంచే దూసుకెళ్లిన మార్కెట్లు ఓ దశలో 50 వేల మారుకును సైతం అధిగమించాయి. అయితే తర్వాత నెమ్మదించి […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లలో బడ్జెట్ ఉత్సాహం కొనసాగుతోంది. సోమవారం నాటి బడ్జెట్‌లో మార్కెట్లకు హుషారునిచ్చే కీలక ప్రకటనలు చేయడంతో భారీగా ఎగిశాయి. అనంతరం మంగళవారం సైతం సూచీలు అదే స్థాయిలో జోరును పెంచాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్లు అత్యధికంగా ర్యాలీ చేయడంతో మార్కెట్లలో జోష్ పెరిగింది. కొత్త బడ్జెట్ ఇచ్చిన బూస్టప్‌తో ఉదయం నుంచే దూసుకెళ్లిన మార్కెట్లు ఓ దశలో 50 వేల మారుకును సైతం అధిగమించాయి. అయితే తర్వాత నెమ్మదించి సెన్సెక్స్ 1,197.11 పాయింట్లు దూసుకెళ్లి 49,797 వద్ద ముగియగా, నిఫ్టీ 366.65 పాయింట్లు ఎగసి 14,647 వద్ద ముగిసింది. నిఫ్టీలో దాదాపుగా అన్ని రంగాలు బలపడగా, ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్ రంగాలు మార్కెట్ల ర్యాలీకి మద్ధతునిచ్చాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్, హిందూస్తాన్ యూనీలీవర్ మినహా అన్ని షేర్లు లాభాల్లో ర్యాలీ చేశాయి. ముఖ్యంగా ఎస్‌బీఐ, ఆల్ట్రా సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్అండ్‌టీ షేర్ల్య్ అత్యధికంగా 4-7 శాతం మధ్య పుంజుకోగా, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకి, కోటక్ బ్యాంక్, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్, ఎంఅండ్ఎం షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.99 వద్ద ఉంది.
‘బ్యాంకింగ్, మౌలికం, ఆటో రంగాల్లో ర్యాలీ భారీగా ఉంది. వృద్ధి ఆధారిత బడ్జెట్‌తో పునరుద్ధరణ మద్ధతు కనిపిస్తోంది. గత వారం భారీగా తగ్గిన లాభాలన్ని వెనక్కొచ్చాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.