స్వల్పంగా నష్టపోయిన మార్కెట్లు!
అంతర్జాతీయ మార్కెట్లో కరోనా(కోవిడ్-19)వైరస్ ప్రభావం కొనసాగుతుండటంతో దేశీయ మార్కెట్లపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వరుస రెండు రోజులు లాభాల్లో నడిచిన మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఆర్థిక మందగమనానికి తోడు రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్టానికి చేరుకోవడం, డిసెంబర్ నెల పారిశ్రామిక వృద్ధి క్షీణించడం వంటి అంశాలు మార్కెట్‌ను బలహీనపరిచాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 106.11 పాయింట్ల నష్టంతో […]
అంతర్జాతీయ మార్కెట్లో కరోనా(కోవిడ్-19)వైరస్ ప్రభావం కొనసాగుతుండటంతో దేశీయ మార్కెట్లపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వరుస రెండు రోజులు లాభాల్లో నడిచిన మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఆర్థిక మందగమనానికి తోడు రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్టానికి చేరుకోవడం, డిసెంబర్ నెల పారిశ్రామిక వృద్ధి క్షీణించడం వంటి అంశాలు మార్కెట్‌ను బలహీనపరిచాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 106.11 పాయింట్ల నష్టంతో 41,459 వద్ద ముగిసింది. నిఫ్టీ 26.55 పాయింట్లు నష్టపోయి 12,174 వద్ద క్లోజయింది. సెన్సెక్స్‌లో డా.రెడ్డీస్, నెస్లే ఇండియా, టైటాన్, టీసీఎస్, హిందూస్తాన్ యూనిలివర్ షేర్లు లాభాల బాటలో పయనించగా, సెన్సెక్స్‌లో ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్ నష్టాలను చూశాయి. నిఫ్టీలో బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ సుజుకీ షేర్లు నష్టాలతో క్లోజయ్యాయి.