లాభాలను కొనసాగించిన స్టాక్ మార్కెట్లు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ ఆర్డర్లు భారీగా పెరగడం, మార్చి త్రైమాసికంలో కంపెనీల ఫలితాలు మెరుగ్గా ఉండటం వంటి పరిణామాలు మార్కెట్లకు కలిసొచ్చాయి. దేశీయంగా కరోనా సెకెండ్ వేవ్, వ్యాక్సిన్‌తో పాటు వైద్య పరికరాల కొరత లాంటి ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల మద్దతుతో లాభాలను సాధించాయి. వీటితో పాటు సెకెండ్ వేవ్ ప్రభావం ఆర్థికవ్యవస్థపై తక్కువ ప్రభావాన్ని […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ ఆర్డర్లు భారీగా పెరగడం, మార్చి త్రైమాసికంలో కంపెనీల ఫలితాలు మెరుగ్గా ఉండటం వంటి పరిణామాలు మార్కెట్లకు కలిసొచ్చాయి. దేశీయంగా కరోనా సెకెండ్ వేవ్, వ్యాక్సిన్‌తో పాటు వైద్య పరికరాల కొరత లాంటి ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల మద్దతుతో లాభాలను సాధించాయి. వీటితో పాటు సెకెండ్ వేవ్ ప్రభావం ఆర్థికవ్యవస్థపై తక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుందని, ఆర్థిక పునరుద్ధరణ మాత్రమే మందగించే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ సానుకూల సంకేతాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలంగా కొనసాగుతోందని విశ్లేషకులు తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 295.94 పాయింట్లు లాభపడి 49,502 వద్ద ముగియగా, నిఫ్టీ 119.20 పాయింట్ల లాభంతో 14,942 వద్ద ముగిసింది.
నిఫ్టీలో మెటల్ ఇండెక్స్ ఏకంగా 3.2 శాతం, ఫార్మా 3 శాతం పుంజుకోగా, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ ఇండెక్స్‌లు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్అండ్‌టీ, డా రెడ్డీస్, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఎంఅండ్ఎం, కోటక్ బ్యాంక్ షేర్లు అధిక లాభాలను సాధించగా, ఆల్ట్రా సిమెంట్, ఇన్ఫోసిస్, రిలయన్స్, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యనక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.31 వద్ద ఉంది.