లాభాల బాటలో మార్కెట్‌లు!
బడ్జెట్ దెబ్బ నుంచి నెమ్మదిగా కోలుకుని మంగళవారం భారీ స్థాయిలో లాభపడిన మార్కెట్‌లు బుధవారం సైతం లాభాల బాటలోనే నడుస్తున్నాయి. సెన్సెక్స్ 220 పాయింట్లు లాభపడి 41,000 మార్కును దాటింది. సెన్సెక్స్ కంటే ముందు నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 12,000 మార్కును దాటి 12,042 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ సానుకూలంగా ట్రేడవుతుండటం కూడా దేశీయ మార్కెట్‌కు కలిసొచ్చింది. భారతీ ఇన్‌ఫ్రాటెల్, లార్సెన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ, బజాజ్ ఆటో, ఐసిఐసిఐ […]
బడ్జెట్ దెబ్బ నుంచి నెమ్మదిగా కోలుకుని మంగళవారం భారీ స్థాయిలో లాభపడిన మార్కెట్‌లు బుధవారం సైతం లాభాల బాటలోనే నడుస్తున్నాయి. సెన్సెక్స్ 220 పాయింట్లు లాభపడి 41,000 మార్కును దాటింది. సెన్సెక్స్ కంటే ముందు నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 12,000 మార్కును దాటి 12,042 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ సానుకూలంగా ట్రేడవుతుండటం కూడా దేశీయ మార్కెట్‌కు కలిసొచ్చింది. భారతీ ఇన్‌ఫ్రాటెల్, లార్సెన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ, బజాజ్ ఆటో, ఐసిఐసిఐ బ్యాంక్, బ్రిటానియా షేర్లు లాభాల బాట పట్టగా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐటీసీ, ఇన్ఫోసిస్, హీరో మోటోకార్ప్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 71.21 వద్ద ఉంది.