రికార్డు గరిష్ఠాలను తాకి కుదేలైన సెన్సెక్స్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా కుదుపులకు లోనయ్యాయి. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు మిడ్-సెషన్ తర్వాత అధిక లాభాలతో దూసుకెళ్లాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా జీవిత కాల గరిష్ఠాలను తాకి, 53,129 మార్కును తాకింది. అయితే, జూన్ నెలకు సంబంధించి ద్రవ్యోల్బణ గణాంకాలపై ప్రతికూల సంకేతాలకు తోడు జీఎస్టీ వసూళ్లు క్షీణించడంతో చివర్లో మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో కొనుగోళ్ల జోరుతో రికార్డు స్థాయికి చేరిన స్టాక్ మార్కెట్లు రిలయన్స్, […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా కుదుపులకు లోనయ్యాయి. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు మిడ్-సెషన్ తర్వాత అధిక లాభాలతో దూసుకెళ్లాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా జీవిత కాల గరిష్ఠాలను తాకి, 53,129 మార్కును తాకింది. అయితే, జూన్ నెలకు సంబంధించి ద్రవ్యోల్బణ గణాంకాలపై ప్రతికూల సంకేతాలకు తోడు జీఎస్టీ వసూళ్లు క్షీణించడంతో చివర్లో మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో కొనుగోళ్ల జోరుతో రికార్డు స్థాయికి చేరిన స్టాక్ మార్కెట్లు రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హిందూస్తాన్ యూనిలీవర్ లాంటి కీలక కంపెనీలు షేర్ల లాభాల స్వీకరణతో మార్కెట్లు కుదేలయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 18.82 పాయింట్లు కోల్పోయి 52,861 వద్ద ముగియగా, నిఫ్టీ 16.10 పాయింట్ల నష్టంతో 15,818 వద్ద ముగిసింది.
నిఫ్టీలో ఆటో ఇండెక్స్ అధికంగా 2 శాతం పతనమవగా, ఐటీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ రంగాలు డీలాపడ్డాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంక్ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఆల్ట్రా సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, కోటక్ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకోగా, టెక్‌మహీంద్రా, టీసీఎస్, మారుతీ సుజుకి, రిలయన్స్, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.51 వద్ద ఉంది.