ప్రతికూల సంకేతాలతో మళ్లీ నష్టాల్లో మార్కెట్లు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా నాలుగోరోజు భారీ నష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో పాటు ఆసియా మార్కెట్లు సైతం బలహీనంగా ఉండటంతో సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచే నష్టాలతో మొదలైన మార్కెట్లు ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో నష్టాల ధోరణిలోనే వారాంతాన్ని ముగించాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో అమ్మకాల ఒత్తిడి అధికంగా కనిపించిందని పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 434.93 […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా నాలుగోరోజు భారీ నష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో పాటు ఆసియా మార్కెట్లు సైతం బలహీనంగా ఉండటంతో సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచే నష్టాలతో మొదలైన మార్కెట్లు ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో నష్టాల ధోరణిలోనే వారాంతాన్ని ముగించాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో అమ్మకాల ఒత్తిడి అధికంగా కనిపించిందని పేర్కొన్నారు.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 434.93 పాయింట్లు పతనమై 50,889 వద్ద ముగియగా, నిఫ్టీ 137.20 పాయింట్లు కోల్పోయి 14,981 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్ రంగం అత్యధికంగా 5 శాతం క్షీణించగా, ఆటో, మెటల్, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ రంగాలు 1-2.6 శాతం మధ్య డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, డా రెడ్డీస్ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, మారుతీ సుజుకి, ఎంఅండ్ఎం షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.73 వద్ద ఉంది.