మరోసారి జీవితకాల గరిష్ఠాలను తాకిన సూచీలు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి రికార్డులను నమోదు చేశాయి. అంతకుముందు నాటి సెషన్‌లో స్వల్ప లాభాలకు పరిమితమైన సూచీలు బుధవారం జీవితకాల గరిష్ఠాలను తాకాయి. ఉదయం నుంచే లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు నెమ్మదిగా పుంజుకున్నాయి. ముఖ్యంగా ఆటో పరిశ్రమతో పాటు టెలికాం రంగానికి కేంద్రం ప్రత్యేకంగా ప్రోత్సాహకాలను ప్రకటించడంతొ సంబంధిత రంగాల్లో జోరు కనబడింది. అలాగే, అల్యూమినియం ధరలు 10 ఏళ్ల గరిష్ఠాలను చేరుకోవడం ద్వారా మెటల్ రంగంలో షేర్లు పుంజుకున్నాయి. వీటితో […]

Update: 2021-09-15 07:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి రికార్డులను నమోదు చేశాయి. అంతకుముందు నాటి సెషన్‌లో స్వల్ప లాభాలకు పరిమితమైన సూచీలు బుధవారం జీవితకాల గరిష్ఠాలను తాకాయి. ఉదయం నుంచే లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు నెమ్మదిగా పుంజుకున్నాయి. ముఖ్యంగా ఆటో పరిశ్రమతో పాటు టెలికాం రంగానికి కేంద్రం ప్రత్యేకంగా ప్రోత్సాహకాలను ప్రకటించడంతొ సంబంధిత రంగాల్లో జోరు కనబడింది. అలాగే, అల్యూమినియం ధరలు 10 ఏళ్ల గరిష్ఠాలను చేరుకోవడం ద్వారా మెటల్ రంగంలో షేర్లు పుంజుకున్నాయి. వీటితో పాటు రిటైల్ ద్రవ్యోల్బణం క్షీణించడం, కొవిడ్ పరిణామాలను అధిగమించి దేశవ్యాప్తంగా కార్యకలాపాలు తెరుచుకుంటున్న నేపథ్యంలో సూచీలు రికార్డులను నమోదు చేశాయి.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ పరిణామాలు ప్రధాన మద్దతుగా నిలవడంతో మదుపర్ల సెంటిమెంట్ పుంజుకుంది. ఓ దశలో బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 58,777 పాయింట్లతో ఆల్‌టైమ్ గరిష్టాలను తాకింది. నిఫ్టీ సైతం 17,459 వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయిలను తాకింది. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 476.11 పాయింట్లు ఎగసి 58.723 వద్ద క్లోజయింది. నిఫ్టీ 139.45 పాయింట్లు లాభపడి 17,519 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ అత్యధికంగా 7 శాతానికి పైగా ర్యాలీ చేసింది.

భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్, టైటాన్, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎల్అండ్‌టీ, బజాజ్ ఆటో షేర్లు అధిక లాభాలను సాధించగా, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, ఆల్ట్రా సిమెంట్, నెస్లె ఇండియా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.46 వద్ద ఉంది.

Tags:    

Similar News