ఈక్విటీ మార్కెట్ల రికార్డ్ ర్యాలీ..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం రికార్డు స్థాయిలో ర్యాలీ చేశాయి. ఉదయం ప్రారంభం సమయంలో మిశ్రమంగా కదలాడిన సూచీలు ఆ తర్వాత క్రమంగా ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలను తాకాయి. నిఫ్టీ ఇండెక్స్ మొట్టమొదటి సారిగా 18,000 మైలురాయిని తాకింది. సెన్సెక్స్ ఇండెక్స్ సైతం 60,476 వద్ద జీవితకాల గరిష్ఠాలను తాకాయి. అయితే, చివర్లో కొంతమేర అమ్మకాల ఒత్తిడి వల్ల కొంత తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల వార్తలకు తోడు దేశీయంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం రికార్డు స్థాయిలో ర్యాలీ చేశాయి. ఉదయం ప్రారంభం సమయంలో మిశ్రమంగా కదలాడిన సూచీలు ఆ తర్వాత క్రమంగా ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలను తాకాయి. నిఫ్టీ ఇండెక్స్ మొట్టమొదటి సారిగా 18,000 మైలురాయిని తాకింది. సెన్సెక్స్ ఇండెక్స్ సైతం 60,476 వద్ద జీవితకాల గరిష్ఠాలను తాకాయి. అయితే, చివర్లో కొంతమేర అమ్మకాల ఒత్తిడి వల్ల కొంత తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల వార్తలకు తోడు దేశీయంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ లాంటి కంపెనీలు షేర్లు మెరుగ్గా ర్యాలీ చేయడంతో సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలపై సానుకూలతలు, ఆర్థికవ్యవస్థ పునరుజ్జీవనంపై ఆశల నేపథ్యంలో పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ బలపడింది.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 76.72 పాయింట్లు లాభపడి 60,135 వద్ద ముగిసింది. నిఫ్టీ 50.75 పాయింట్ల లాభంతో 17,945 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐతీ రంగం మినహా మిగిలిన రంగాలు పుంజుకున్నాయి. ఆటో రంగం అత్యధికంగా 3 శాతం బలపడగా, బ్యాంకింగ్, ఫైనాన్స్, మీడియా, మెటల్, రియల్టీ రంగాలు పెరిగాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ సుజుకి, పవర్‌గ్రిడ్, ఐటీసీ, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, ఎంఅండ్ఎం, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు అధిక లాభాలను సాధించాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.41 వద్ద ఉంది.