వరుసగా ఐదోరోజు రికార్డు లాభాలు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి లాభాలతో ముగిశాయి. ఉదయం ప్రారంభమైన తర్వాత 47 వేల సరికొత్త గరిష్టానికి చేరుకున్నప్పటికీ ఆటుపోట్లకు గురై వెనక్కి తగ్గాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్ల లాభాల స్వీకరణకు మదుపర్లు ఆసక్తి చూపడంతో సూచీలు ఆటుపోట్లకు గురైనట్టు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆర్థికవ్యవస్థ రికవరీ అంచనాలతో పాటు ఈక్విటీ ఎఫ్‌పీఐల పెట్టుబడులతో మార్కెట్లు వరుసగా ఐదో రోజూ రికార్డు లాభాలను దక్కించుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వారాంతం ట్రేడర్లు […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి లాభాలతో ముగిశాయి. ఉదయం ప్రారంభమైన తర్వాత 47 వేల సరికొత్త గరిష్టానికి చేరుకున్నప్పటికీ ఆటుపోట్లకు గురై వెనక్కి తగ్గాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్ల లాభాల స్వీకరణకు మదుపర్లు ఆసక్తి చూపడంతో సూచీలు ఆటుపోట్లకు గురైనట్టు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆర్థికవ్యవస్థ రికవరీ అంచనాలతో పాటు ఈక్విటీ ఎఫ్‌పీఐల పెట్టుబడులతో మార్కెట్లు వరుసగా ఐదో రోజూ రికార్డు లాభాలను దక్కించుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వారాంతం ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించారని అందుకే ఒడిదుడుకులకు లోనైనట్టు వారు భావిస్తున్నారు.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 70.35 పాయింట్ల లాభంతో 46,960 వద్ద ముగియగా, నిఫ్టీ 19.85 పాయింట్లు లాభపడి 13,760 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాలు పుంజుకోగా, ప్రైవేట్ రంగ , ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫైనాన్స్, మెటల్, ఆటో రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్, టైటాన్, ఏషియన్ పెయింట్ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ సుజుకి, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.52 వద్ద ఉంది.