స్వల్ప లాభాల్లో సూచీలు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు(Domestic equity markets) రోజంతా ఊగిసలాట అనంతరం లాభాల్లో ముగిశాయి. వరుస మూడు సెషన్‌ల నష్టాల తర్వాత మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. ఉదయం ప్రారంభం నుంచే నష్టాలను నమోదు చేసిన సూచీలు చివరి గంటలో బ్యాంకింగ్ షేర్ల మద్దతుతో స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి. కొవిడ్-19 వ్యాప్తి సెకెండ్ వేవ్ కారణంగా అమెరికా, యూరప్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. దీంతో దేశీయంగా మదుపర్లు (Investors) అప్రమత్తంగా వ్యవహరించారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రైవేట్ […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు(Domestic equity markets) రోజంతా ఊగిసలాట అనంతరం లాభాల్లో ముగిశాయి. వరుస మూడు సెషన్‌ల నష్టాల తర్వాత మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. ఉదయం ప్రారంభం నుంచే నష్టాలను నమోదు చేసిన సూచీలు చివరి గంటలో బ్యాంకింగ్ షేర్ల మద్దతుతో స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి.
కొవిడ్-19 వ్యాప్తి సెకెండ్ వేవ్ కారణంగా అమెరికా, యూరప్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. దీంతో దేశీయంగా మదుపర్లు (Investors) అప్రమత్తంగా వ్యవహరించారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగ బ్యాంకుల షేర్లు రాణించడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. అదేవిధంగా సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాల లాభాలు డీలపడటంతో కంపెనీ షేర్లు అత్యధికంగా నష్టాలను నమోదు చేశాయి.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 143.51 పాయింట్లు లాభపడి 39,757 వద్ద ముగియగా, నిఫ్టీ 26.75 పాయింట్ల లాభంతో 11,669 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్ రంగ షేర్లు అధికంగా 4 శాతానికిపైగా పుంజుకోగా, రియల్టీ 3 శాతానికిపైగా లాభపడింది. ఫార్మా, ఐటీ రంగ షేర్లు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా 6 శాతానికి మించి లాభపడగా, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు బలపడ్డాయి. ఇక, రిలయన్స్ అత్యధికంగా 8 శాతానికీపిగా డీలాపడగా, హెచ్‌సీఎల్, టీసీఎస్, ఏషియన్ పెయింట్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, మారుతీ సుజుకి షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.45 వద్ద ఉంది.