దీపావళి నాటికి 72,000కు సెన్సెక్స్!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వచ్చే ఏడాది దీపావళి సమయానికి ప్రస్తుతం ఉన్న దానికంటే మరో 15 శాతం పుంజుకుంటాయని మార్కెట్ పరిశీలకులు భావిస్తున్నారు. జీఎస్టీ వసూళ్లు పెరగడం, ఇంధన డిమాండ్ సహా స్థూల ఆర్థిక గణాంకాల ధోరణి నేపథ్యంలో మార్కెట్ల సెంటిమెంట్‌ను కొనసాగించగలవని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ యెస్ సెక్యూరిటీస్ తెలిపింది. ఈ నేపథ్యంలో 2022లో దీపావళి నాటికి బీఎస్ఈ సెన్సెక్స్ 72,000 మార్కును, నిఫ్టీ 21,000 మైలురాయిని చేరుకుంటాయని అంచనా వేసింది. ఇది […]

Update: 2021-11-02 09:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వచ్చే ఏడాది దీపావళి సమయానికి ప్రస్తుతం ఉన్న దానికంటే మరో 15 శాతం పుంజుకుంటాయని మార్కెట్ పరిశీలకులు భావిస్తున్నారు. జీఎస్టీ వసూళ్లు పెరగడం, ఇంధన డిమాండ్ సహా స్థూల ఆర్థిక గణాంకాల ధోరణి నేపథ్యంలో మార్కెట్ల సెంటిమెంట్‌ను కొనసాగించగలవని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ యెస్ సెక్యూరిటీస్ తెలిపింది. ఈ నేపథ్యంలో 2022లో దీపావళి నాటికి బీఎస్ఈ సెన్సెక్స్ 72,000 మార్కును, నిఫ్టీ 21,000 మైలురాయిని చేరుకుంటాయని అంచనా వేసింది.

ఇది ప్రస్తుతం ఉన్నదానికంటే 15 శాతం పెరుగుదల అని యెస్ సెక్యూరిటీస్ పేర్కొంది. గతేడాది దీపావళి నాటి నుంచి ప్రస్తుతం సెన్సెక్స్ ఇండెక్స్ 38 శాతం, నిఫ్టీ50 ఇండెక్స్ 40 శాతం పెరిగిందని ఈక్వినోమిక్స్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ వ్యవస్థాపకుడు జి చొక్కలింగం అన్నారు. ఇతర సానుకూల అంశాలు మార్కెట్లను నడిపించనున్నాయి. ముఖ్యంగా వ్యాపార విశ్వాసం, ప్రభుత్వ పన్ను రాబడులు, ఆర్థిక పరిస్థితులు, ఎగుమతులు, ముడి చమురు దిగుమతులు, ఋతుపవనాలు, ఇంకా ఆర్థిక గణాంకాలు మార్కెట్లకు మద్దతివ్వనున్నాయి.

ఇటీవల ఈక్విటీ మార్కెట్లలో కొత్త పెట్టుబడిదారులు పెరుగుతున్నారు. ఒక్క అక్టోబర్‌లోనే బీఎస్ఈలో 35 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లు నమోదయ్యారు. గత 12 నెలల్లో 3 కోట్ల మంది కొత్త ఈక్విటీ ఇన్వెస్టర్లు చేరారు. ఈ అంశాలన్నీ మార్కెట్లకు కలిసి రానున్నాయని యెస్ సెక్యూరిటీస్ వెల్లడించింది.

Tags:    

Similar News