వరుస నష్టాల్లో సూచీలు.. 19 రంగాల్లో 14 రంగాలు కుదేలు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాలను ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో బుధవారం ఉదయం నుంచే నష్టాలను చూసిన సూచీలు కీలక రంగాల్లో పెట్టుబడిదారులు అమ్మకాలకు దిగడంతో ఇంట్రాడే కనిష్ఠానికి పతనమయ్యాయి. అయితే, చివరి గంటలో కీలక కంపెనీల షేర్ల కోసం ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరపడంతో ఇంట్రాడే కనిష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు బయటపడ్డాయి. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా కరోనా కేసులతో పాటు మరణాలు కూడా పెరగడం, పలు కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాలను ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో బుధవారం ఉదయం నుంచే నష్టాలను చూసిన సూచీలు కీలక రంగాల్లో పెట్టుబడిదారులు అమ్మకాలకు దిగడంతో ఇంట్రాడే కనిష్ఠానికి పతనమయ్యాయి. అయితే, చివరి గంటలో కీలక కంపెనీల షేర్ల కోసం ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరపడంతో ఇంట్రాడే కనిష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు బయటపడ్డాయి. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా కరోనా కేసులతో పాటు మరణాలు కూడా పెరగడం, పలు కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహంగా ఉండటంతో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. మొత్తం 19 రంగాల్లో 14 రంగాలు కుదేలయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 135.05 పాయింట్లు కోల్పోయి 52,443 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 37.05 పాయింట్లు నష్టపోయి 15,709 వద్ద ముగిసింది.
నిఫ్టీలో పోస్ట్ పెయిడ్ ఛార్జీలను పెంచిన కారణంగా టెలికాం రంగం స్టాక్స్ 4.5 శాతం పుంజుకున్నాయి. మెటల్ ఇండెక్స్ 1 శాతం ర్యాలీ చేయగా, ఐటీ రంగం బలపడింది. ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ, ఫార్మా రంగాల్లో అమ్మకాల ధోరణి కనబడింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో అత్యధికంగా భారతీ ఎయిర్‌టెల్ 5 శాతానికి పైగా దూసుకెళ్లింది. టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్ లాభాలను దక్కించుకోగా, కోటక్ బ్యాంక్, డా రెడ్డీస్, ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, నెస్లె ఇండియా షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.38 వద్ద ఉంది.