లాభాలను కొనసాగిస్తున్న మార్కెట్లు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి లాభాలను దక్కించుకున్నాయి. కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ వేగంగా అందుబాటులోకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో మార్కెట్‌లో ఇన్వెస్టర్ల విశ్వాసం బలంగా కొనసాగుతోంది. అంతేకాకుండా, భారత్‌లో పెట్టుబడులు సురక్షితమనే నమ్మకంతో విదేశీ సంస్థాగత పెట్టుబడులు భారీగా వచ్చి చేరుతున్నాయి. దీంతో మార్కెట్లు గత కొన్ని వారాలుగా వరుస జీవిత కాల గరిష్ఠాలను సూచీలు నమోదు చేశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 154.45 పాయింట్లు లాభపడి 46,253 వద్ద […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి లాభాలను దక్కించుకున్నాయి. కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ వేగంగా అందుబాటులోకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో మార్కెట్‌లో ఇన్వెస్టర్ల విశ్వాసం బలంగా కొనసాగుతోంది. అంతేకాకుండా, భారత్‌లో పెట్టుబడులు సురక్షితమనే నమ్మకంతో విదేశీ సంస్థాగత పెట్టుబడులు భారీగా వచ్చి చేరుతున్నాయి.
దీంతో మార్కెట్లు గత కొన్ని వారాలుగా వరుస జీవిత కాల గరిష్ఠాలను సూచీలు నమోదు చేశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 154.45 పాయింట్లు లాభపడి 46,253 వద్ద ముగియగా, నిఫ్టీ 44.30 పాయింట్ల లాభంతో 13,558 వద్ద ముగిసింది. నిఫ్టీలో మీడియా 2 శాతానికి పైగా పుంజుకోగా, మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంకులు 1 శాతం మేర బలపడ్డాయి.
ఆటో, రియల్టీ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఓఎన్‌జీసీ, ఎల్అండ్‌టీ, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్, టైటాన్, ఏషీయన్ పెయింట్, ఆల్ట్రా సిమెంట్, కోటక్ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.55 వద్ద ఉంది.