నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
ముంబయి: చైనాతో సరిహద్దు వివాదం తలెత్తడంతో దేశీయంగా మార్కెట్లలో సెంటిమెంటు బలహీనపడింది. దేశీ ఈక్విటీ మార్కెట్లు రోజంతా ఊగిసలాటలో ఉండిపోయాయి. దీనికితోడు దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం కూడా మార్కెట్లపై పడింది. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల సంకేతాలను ఇస్తున్నప్పటికీ దేశీయ సూచీలు ఆటుపోట్ల మధ్య కదలాడాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 97.30 పాయింట్ల స్వల్ప నష్టంతో 33,507 వద్ద ముగియగా, నిఫ్టీ 32.85 పాయింట్ల నష్టంతో 9,881 వద్ద ముగిశాయి. రంగాల వారీగా […]
ముంబయి: చైనాతో సరిహద్దు వివాదం తలెత్తడంతో దేశీయంగా మార్కెట్లలో సెంటిమెంటు బలహీనపడింది. దేశీ ఈక్విటీ మార్కెట్లు రోజంతా ఊగిసలాటలో ఉండిపోయాయి. దీనికితోడు దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం కూడా మార్కెట్లపై పడింది. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల సంకేతాలను ఇస్తున్నప్పటికీ దేశీయ సూచీలు ఆటుపోట్ల మధ్య కదలాడాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 97.30 పాయింట్ల స్వల్ప నష్టంతో 33,507 వద్ద ముగియగా, నిఫ్టీ 32.85 పాయింట్ల నష్టంతో 9,881 వద్ద ముగిశాయి. రంగాల వారీగా చూస్తే, బ్యాంకింగ్, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాలు నష్టాల్లో ట్రేడవ్వగా, ఆటో, మీడియా, ఫార్మా, రియల్టీ రంగాల షేర్లు కొంత లాభాల్లో కదలాడాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాస్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, కోటక్ బ్యాంక్, ఐటీసీ, ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.