లాభాల జోరు కొనసాగించిన సూచీలు

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా కొవిడ్-19 కేసులు భారీగా పెరుగుతున్నప్పటికీ.. దేశీయ సూచీలు ఈ వారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లు నిలకడగా ట్రేడవ్వడం, కీలక కంపెనీల షేర్లు రాణించడంతో సూచీలు లాభాలను నమోదు చేశాయి. ఉదయం ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే నిఫ్టీ కీలకమైన 11 వేల మార్కును అధిగమించింది. నిఫ్టీలో ఫార్మా మినహా మిగిలిన రంగాలన్నీ బలపడగా, అత్యధికంగా ఐటీ రంగం, నిఫ్టీ బ్యాంక్ పుంజుకున్నాయి. బీఎస్ఈ […]

Update: 2020-07-20 05:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా కొవిడ్-19 కేసులు భారీగా పెరుగుతున్నప్పటికీ.. దేశీయ సూచీలు ఈ వారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లు నిలకడగా ట్రేడవ్వడం, కీలక కంపెనీల షేర్లు రాణించడంతో సూచీలు లాభాలను నమోదు చేశాయి. ఉదయం ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే నిఫ్టీ కీలకమైన 11 వేల మార్కును అధిగమించింది. నిఫ్టీలో ఫార్మా మినహా మిగిలిన రంగాలన్నీ బలపడగా, అత్యధికంగా ఐటీ రంగం, నిఫ్టీ బ్యాంక్ పుంజుకున్నాయి. బీఎస్ఈ మార్కెట్ మిడ్ సెషన్ సమయం తర్వాత హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ చివరికి అధిక లాభాలను నమోదు చేసింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 398.85 పాయింట్లు లాభపడి 37,418 వద్ద ముగియగా, నిఫ్టీ 120.50 పాయింట్ల లాభంతో 11,022 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఏషియన్ పెయింట్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, మారుతీ సుజుకి, కోటక్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, ఐటీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

Tags:    

Similar News