లాభాలతో ముగిసిన మార్కెట్లు!

ముంబయి: మార్కెట్లకు ఊరట లభించింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు మధ్యాహ్నం లంచ్ సమయం తర్వాత భారీగా కోలుకుని అమ్మకాల ఒత్తిడిని అధిగమించాయి. అమెరికా ఫెడ్ కార్పొరేట్ల బాండ్ల కొనుగోలు కార్యక్రమాన్ని ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై సానుకూలంగా కదలాడాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 376.42 పాయింట్ల లాభంతో 33,605 వద్ద ముగియగా, నిఫ్టీ 100.30 పాయింట్లు లాభపడి 9,914 వద్ద ముగిసింది. […]

Update: 2020-06-16 06:20 GMT

ముంబయి: మార్కెట్లకు ఊరట లభించింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు మధ్యాహ్నం లంచ్ సమయం తర్వాత భారీగా కోలుకుని అమ్మకాల ఒత్తిడిని అధిగమించాయి. అమెరికా ఫెడ్ కార్పొరేట్ల బాండ్ల కొనుగోలు కార్యక్రమాన్ని ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై సానుకూలంగా కదలాడాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 376.42 పాయింట్ల లాభంతో 33,605 వద్ద ముగియగా, నిఫ్టీ 100.30 పాయింట్లు లాభపడి 9,914 వద్ద ముగిసింది. రంగాల వారీగా చూస్తే మెటల్, మీడియా, ప్రైవేట్ బ్యాంకుల సూచీలు లాభాల్లో ట్రేడవ్వగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫార్మా, రియల్టీ, ఎఫ్ఎంసీజీ షేర్లు కొంత బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హీరో మోటోకార్ప్, టైటాన్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.21 వద్ద ఉంది.

Tags:    

Similar News