లాభాలు నమోదు చేసిన మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో దేశీయ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్, బ్యాంకింగ్ షేర్ల అండతో ఉదయం నుంచే సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. మిడ్ సెషన్ సమయంలో కొంత ఊగిసలాటకు లోనైనప్పటికీ చివర్లో లాభాలను నమోదు చేశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 290.36 పాయింట్లు లాభపడి 34,247 వద్ద ముగియగా, నిఫ్టీ 69.50 పాయింట్ల లాభంతో 10,116 వద్ద ముగిసింది. అమెరికా మార్కెట్ల సంకేతాలతో సెంటిమెంట్ బలపడిందని […]

Update: 2020-06-10 06:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో దేశీయ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్, బ్యాంకింగ్ షేర్ల అండతో ఉదయం నుంచే సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. మిడ్ సెషన్ సమయంలో కొంత ఊగిసలాటకు లోనైనప్పటికీ చివర్లో లాభాలను నమోదు చేశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 290.36 పాయింట్లు లాభపడి 34,247 వద్ద ముగియగా, నిఫ్టీ 69.50 పాయింట్ల లాభంతో 10,116 వద్ద ముగిసింది. అమెరికా మార్కెట్ల సంకేతాలతో సెంటిమెంట్ బలపడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రంగాల వారీగా చూస్తే.. మెటల్‌, ఆటో షేర్లు నష్టాలను చూడగా.. ఇన్‌ఫ్రా, ఫార్మా, ఐటీ, ఎనర్జీ రంగాల షేర్లు లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, టైటాన్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

Tags:    

Similar News