లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా ఐదోరోజు లాభాలను నమోదు చేశాయి. యూఎస్, యూరప్ మార్కెట్లు లాభాలను నమోదు చేయడంతో ఆ ప్రభావం దేశీయ మదుపర్ల సెంటిమెంట్‌ను బలపరిచిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మిడ్ సెషన్ తర్వాత ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు కొంత ఒడిదుడుకులకు లోనైనప్పటికీ చివర్లో లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ 187.24 పాయింట్లు లాభపడి 36,674 వద్ద ముగియగా, నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 10,799 వద్ద […]

Update: 2020-07-07 06:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా ఐదోరోజు లాభాలను నమోదు చేశాయి. యూఎస్, యూరప్ మార్కెట్లు లాభాలను నమోదు చేయడంతో ఆ ప్రభావం దేశీయ మదుపర్ల సెంటిమెంట్‌ను బలపరిచిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మిడ్ సెషన్ తర్వాత ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు కొంత ఒడిదుడుకులకు లోనైనప్పటికీ చివర్లో లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ 187.24 పాయింట్లు లాభపడి 36,674 వద్ద ముగియగా, నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 10,799 వద్ద ముగిసింది. రంగాల వారీగా చూస్తే, నిఫ్టీలో ప్రైవేట్ బ్యాంక్, ఐటీ రంగాలు లాభాలను నమోదు చేయగా, మెటల్, రియల్టీ రంగాలు కొంత డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫినాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు అధిక లాభాలను నమోదు చేయగా, ఎన్‌టీపీసీ, ఐటీసీ, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

Tags:    

Similar News