అమ్మకాల ఒత్తిడి.. నష్టపోయిన మార్కెట్లు!
దిశ, వెబ్‌డె: గత కొద్ది రోజులుగా వరుస లాభాలను నమోదు చేసిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం నష్టాలను నమోదు చేశాయి. సోమవారం స్వల్ప లాభాలను చూసినప్పటికీ ఇవాళ భారీ నష్టాలను చూడక తప్పలేదు. ఉదయం లాభాలతో హుషారుగా మొదలైనప్పటికీ చివరి గంటలో అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇటీవల కేంద్ర బ్యాంకుల ప్యాకేజీలతోను, లాక్‌డౌన్ ఆంక్షల సడలింపులతోనూ మార్కెట్లు వరుస లాభాలను నమోదు చేశాయి. మిడ్ సెషన్ సమయంలో యూరప్ మార్కెట్లు ప్రారంభమే 1 […]
దిశ, వెబ్‌డె: గత కొద్ది రోజులుగా వరుస లాభాలను నమోదు చేసిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం నష్టాలను నమోదు చేశాయి. సోమవారం స్వల్ప లాభాలను చూసినప్పటికీ ఇవాళ భారీ నష్టాలను చూడక తప్పలేదు. ఉదయం లాభాలతో హుషారుగా మొదలైనప్పటికీ చివరి గంటలో అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇటీవల కేంద్ర బ్యాంకుల ప్యాకేజీలతోను, లాక్‌డౌన్ ఆంక్షల సడలింపులతోనూ మార్కెట్లు వరుస లాభాలను నమోదు చేశాయి. మిడ్ సెషన్ సమయంలో యూరప్ మార్కెట్లు ప్రారంభమే 1 శాతానికిపైగా నష్టపోవడంతో సెంటిమెంట్ బలహీనపడిందని నిపుణులు భావిస్తున్నారు. దీనికి తోడు లాభాల స్వీకరణ ఎక్కువ ప్రాధాన్యం కావడంతో ప్రభావం అధికంగా ఉందని అభిప్రాయపడ్డారు. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 413.89 పాయింట్లను కోల్పోయి 33,956 వద్ద ట్రేడవ్వగా, నిఫ్టీ 120.80 పాయింట్లను నష్టపోయి 10,046 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్, సన్‌ఫార్మా, ఎంఅండ్ఎం, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ షేర్లు లాభాలను నమోదు చేయగా, ఐసీఐసీఐ, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.