ప్రముఖ లాయర్‌కు 6 నెలల జైలు శిక్ష!: సుప్రీం
న్యూఢిల్లీ: సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఫొటోతో ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్య కోర్టును ధిక్కరించేలా ఉన్నదని దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. క్రిమినల్ కంటెంప్ట్ కింద అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్‌కు విధించాల్సిన శిక్షపై ఈ నెల 20న వాదనలు వింటుందని వెల్లడించింది. సీనియర్ లాయర్ భూషణ్‌కు ఈ కేసులో ఆరునెలల జైలు శిక్ష […]
న్యూఢిల్లీ: సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఫొటోతో ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్య కోర్టును ధిక్కరించేలా ఉన్నదని దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. క్రిమినల్ కంటెంప్ట్ కింద అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్‌కు విధించాల్సిన శిక్షపై ఈ నెల 20న వాదనలు వింటుందని వెల్లడించింది. సీనియర్ లాయర్ భూషణ్‌కు ఈ కేసులో ఆరునెలల జైలు శిక్ష లేదా రూ. 2000 జరిమానా, లేదా రెండూ కలిపి వేసే అవకాశమున్నది. సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఓ బీజేపీ నేతకు చెందిన హర్లీ డేవిడ్సన్ బైక్‌పై కూర్చుని ఉన్న ఫొటోపై వ్యాఖ్యానిస్తూ జూన్ 29న ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. జూన్ 27వ తేదీనా న్యాయవ్యవస్థపై ఓ కామెంట్ చేశారు. ప్రశాంత్ భూషణ్ ట్వీట్‌ను క్రిమినల్ కంటెంప్ట్‌గా సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుంది.