'జమ్మూకాశ్మీర్ విద్యార్థులను పంపించండి'

దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ కాలంలో తెలంగాణలో చిక్కుకుపోయిన 260 మందిని జమ్మూకాశ్మీర్‌కు పంపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మంగళవారం సూచించింది. సోమవారం మెయిల్‌లో అందిన పిటిషన్‌పై స్పందించింది. వారిని సొంత ప్రాంతాలకు చేర్చడంతో పాటు సంబంధిత రిపోర్టును కమిషన్‌కు సమర్పించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, నోడల్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియాలను ఆదేశించింది. జమ్మూకాశ్మీర్‌కు చెందిన వారిలో 180 మంది విద్యార్థులు ఉండగా.. 70 మందికి […]

Update: 2020-05-05 10:07 GMT

దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ కాలంలో తెలంగాణలో చిక్కుకుపోయిన 260 మందిని జమ్మూకాశ్మీర్‌కు పంపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మంగళవారం సూచించింది. సోమవారం మెయిల్‌లో అందిన పిటిషన్‌పై స్పందించింది. వారిని సొంత ప్రాంతాలకు చేర్చడంతో పాటు సంబంధిత రిపోర్టును కమిషన్‌కు సమర్పించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, నోడల్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియాలను ఆదేశించింది. జమ్మూకాశ్మీర్‌కు చెందిన వారిలో 180 మంది విద్యార్థులు ఉండగా.. 70 మందికి పైగా మహిళలు ఉన్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.

Tags: corona, Lockdown, SHRC, Telangana, migrant, students, Jammu & Kashmir

Tags:    

Similar News