వాహన తనిఖీల్లో రూ.2 లక్షలు పట్టివేత
దిశ, దుబ్బాక: దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ కారులో రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దుబ్బాక నియోజకవర్గంతో బుధవారం ఉదయం ఎన్నికల పోలీస్ నోడల్ అధికారి సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ, భూంపల్లి ఎస్ఐ సర్దార్ జమీల్, సిబ్బందితో కలసి వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ములుగు జిల్లా సింగరకుంట గ్రామానికి చెందిన సీహెచ్ రాజేందర్ కారులో ఎలాంటి ఆధారాలు లేనందున రూ. […]
దిశ, దుబ్బాక: దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ కారులో రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. దుబ్బాక నియోజకవర్గంతో బుధవారం ఉదయం ఎన్నికల పోలీస్ నోడల్ అధికారి సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ, భూంపల్లి ఎస్ఐ సర్దార్ జమీల్, సిబ్బందితో కలసి వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ములుగు జిల్లా సింగరకుంట గ్రామానికి చెందిన సీహెచ్ రాజేందర్ కారులో ఎలాంటి ఆధారాలు లేనందున రూ. 2 లక్షలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ బాలాజీ మాట్లాడుతూ.. రాజేందర్ కారులో గుర్తించిన రూ.2 లక్షల నగదును దుబ్బాక ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించినట్లు తెలిపారు. డబ్బులకు సంబంధించి సరైన ధృవపత్రాలను చూపించి డబ్బులు తీసుకోవచ్చని తెలిపారు. ఉప ఎన్నికల నేపథ్యంలో 50 వేల రూపాయలకు మించి ఎవరు కూడా డబ్బులు వాహనాలలో తీసుకెళ్లకూడదని సూచించారు.