విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత.. బంగారాన్ని ఎక్కడ పెట్టాడంటే..

దిశ, శంషాబాద్: గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు ఓ వ్యక్తి పట్టుబడ్డ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం దుబాయ్ నుండి ఇండిగో (6E-25) విమానంలో ఓ ప్రయాణికుడు హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు. కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ప్రయాణికునిపై అనుమానం వచ్చి పూర్తిగా స్కాన్ చేయడం‌తో బంగారం ఉన్నట్లు గుర్తించారు. బంగారాన్ని ప్రయాణికుడు పొడిగా మార్చి పురుష నాళంలో అమర్చుకొని […]

Update: 2021-12-27 09:59 GMT

దిశ, శంషాబాద్: గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు ఓ వ్యక్తి పట్టుబడ్డ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం దుబాయ్ నుండి ఇండిగో (6E-25) విమానంలో ఓ ప్రయాణికుడు హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు. కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ప్రయాణికునిపై అనుమానం వచ్చి పూర్తిగా స్కాన్ చేయడం‌తో బంగారం ఉన్నట్లు గుర్తించారు. బంగారాన్ని ప్రయాణికుడు పొడిగా మార్చి పురుష నాళంలో అమర్చుకొని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం 59 లక్షల 23 వేల విలువ జేసే 1 కిలో 19 గ్రాములు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నమని తెలిపారు.

Tags:    

Similar News