49204084041.. ఏయ్.. మళ్ళీ ఏసేశాడు!

దిశ, వెబ్ డెస్క్ : 4,9,2,0,4,0,8,4, 0, ఇవి శ్రీ చైతన్య – నారాయణ విద్యార్ధులకు వచ్చిన ర్యాంక్ లు కాదు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఇండియన్ క్రికెటర్లు చేసిన రన్స్. ఈ రన్స్ పై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. భారత్ – ఆస్ట్రేలియాల మధ్య మొదటి పింక్ బాల్ టెస్ట్‌లో టీమ్ ఇండియా చెత్త రికార్డ్ ను సృష్టించిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులే చేసి చెత్త […]

Update: 2020-12-19 02:13 GMT

దిశ, వెబ్ డెస్క్ : 4,9,2,0,4,0,8,4, 0, ఇవి శ్రీ చైతన్య – నారాయణ విద్యార్ధులకు వచ్చిన ర్యాంక్ లు కాదు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఇండియన్ క్రికెటర్లు చేసిన రన్స్. ఈ రన్స్ పై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

భారత్ – ఆస్ట్రేలియాల మధ్య మొదటి పింక్ బాల్ టెస్ట్‌లో టీమ్ ఇండియా చెత్త రికార్డ్ ను సృష్టించిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులే చేసి చెత్త రికార్డ్ ను నమోదు చేసింది. అభిమానులు ఆటను ఆస్వాదించడం ప్రారంభించక ముందే భారత్ ఆటగాళ్లు వరుసగా పెవీలియన్ కు క్యూకట్టడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీమ్స్ క్రియేట్ చేసి భారత్ ఆటగాళ్ల ఆటతీరుపై కసి తీర్చుకుంటున్నారు.

నెటిజన్లే కాదు టీమిండియా మాజీ క్రికెటర్లు సైతం పెదవి విరుస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తన దైన స్ట్రైల్లో భారత్ క్రికెటర్ల స్కోర్ ను వ్యంగంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ ను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.

Tags:    

Similar News