ధోనీ పునరాగమనం కష్టమే : సెహ్వాగ్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తిరిగి జట్టులోకి రావడం కష్టమేనని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా జట్టుకు సేవలందించిన ధోనీకి ప్రత్యామ్నాయంగా యువ క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారని సెహ్వాగ్ తెలిపాడు. టీమ్ ఇండియాలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ అటు బ్యాటింగ్‌, ఇటు కీపింగ్‌‌లోనూ రాణిస్తున్న విషయాన్ని సెహ్వాగ్ గుర్తు చేశాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత ఇప్పటి వరకు ధోనీ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. […]

Update: 2020-03-18 03:44 GMT

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తిరిగి జట్టులోకి రావడం కష్టమేనని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా జట్టుకు సేవలందించిన ధోనీకి ప్రత్యామ్నాయంగా యువ క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారని సెహ్వాగ్ తెలిపాడు. టీమ్ ఇండియాలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ అటు బ్యాటింగ్‌, ఇటు కీపింగ్‌‌లోనూ రాణిస్తున్న విషయాన్ని సెహ్వాగ్ గుర్తు చేశాడు.

వన్డే ప్రపంచకప్ తర్వాత ఇప్పటి వరకు ధోనీ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో బీసీసీఐ అతని కాంట్రాక్ట్‌ను పునరుద్దరించని విషయం తెలిసిందే. పలు మార్లు ధోనీ రిటైర్మెంట్‌ గురించిన వార్తలు వచ్చినా.. ధోనీ వాటిపై ఏనాడూ స్పందించలేదు. కాగా ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు గతంలో మీడియాతో చెప్పిన కోచ్ రవిశాస్త్రి ఇటీవల మాట మార్చాడు. ఐపీఎల్‌లో రాణిస్తేనే టీ20 ప్రపంచకప్ జట్టులోకి పరిశీలిస్తామని చెప్పాడు. కాగా, ఇప్పుడు ఐపీఎల్ నిర్వహణ సందిగ్ధంలో పడటంతో ధోనీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

tags : Dhoni, team India, Sehwag, Coach Ravi shastri, Retirement

Tags:    

Similar News