సమాజ్ వాదీ పార్టీ ఎంపీపై దేశద్రేహం కేసు..

దిశ, వెబ్‌డెస్క్ : తాలిబన్లను భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చినందుకు గాను సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ షఫీఖర్ రహమాన్ బార్క్‌పై దేశద్రోహం చట్టం కింద కేసు నమోదైంది. విద్రోహానికి, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని భావిస్తూ ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. లోక్‌సభ ఎంపీ మాట్లాడుతూ.. ‘‘భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు, మన దేశం స్వేచ్ఛ కోసం పోరాడింది. ఇప్పుడు అమెరికా దళాలు అఫ్ఘనిస్తాన్ నుంచి వెనుదిరగడంతో విదేశీయుల హస్తం […]

Update: 2021-08-18 11:45 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తాలిబన్లను భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చినందుకు గాను సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ షఫీఖర్ రహమాన్ బార్క్‌పై దేశద్రోహం చట్టం కింద కేసు నమోదైంది. విద్రోహానికి, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని భావిస్తూ ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆయనపై ఈ కేసు నమోదు చేశారు.

లోక్‌సభ ఎంపీ మాట్లాడుతూ.. ‘‘భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు, మన దేశం స్వేచ్ఛ కోసం పోరాడింది. ఇప్పుడు అమెరికా దళాలు అఫ్ఘనిస్తాన్ నుంచి వెనుదిరగడంతో విదేశీయుల హస్తం నుంచి విముక్తి పొందిన తమ దేశాన్ని తాలిబన్లు నడపాలని కోరుకుంటున్నారు’’ అని చెప్పారు. తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు.

Tags:    

Similar News