బిగ్ బ్రేకింగ్.. ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో ముంబైలో 144 సెక్షన్ విధింపు

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ‘ఒమిక్రాన్’ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారానికి దేశవ్యాప్తంగా 32 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా, మహారాష్ట్రలో ‘ఒమిక్రాన్‌’ కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే మహారాష్ట్రలో ఏడు కేసులు నమోదు అయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబైలో శనివారం నుంచి రెండు రోజుల పాటు 144 సెక్షన్‌ విధించారు. ర్యాలీలు, మోర్చాలు వంటి కార్యక్రమాలపై నిషేధం విధించారు. […]

Update: 2021-12-11 00:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ‘ఒమిక్రాన్’ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారానికి దేశవ్యాప్తంగా 32 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా, మహారాష్ట్రలో ‘ఒమిక్రాన్‌’ కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే మహారాష్ట్రలో ఏడు కేసులు నమోదు అయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ముంబైలో శనివారం నుంచి రెండు రోజుల పాటు 144 సెక్షన్‌ విధించారు. ర్యాలీలు, మోర్చాలు వంటి కార్యక్రమాలపై నిషేధం విధించారు. అధిక సంఖ్యలో ప్రజలు ఒకచోట గుమిగూడరాదని డిప్యూటీ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉంటాయని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా ఒమిక్రాన్ సోకిన ఏడుగురిలో ఐదుగురు కోలుకున్నట్లు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రకటించారు. పింప్రి చించ్వాడా ప్రాంతంలో ఉన్న ఆరుగురిలో నలుగురు, పుణె నగరంలో ఓ వ్యక్తికి నెగటివ్‌గా తేలింది. కరోనా బారినపడిని ఏడుగురి ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని పవార్ తెలిపారు.

 

Tags:    

Similar News